Nallamala | పులిరాజా సరసమాడే వేళ.. ఇటు రాకండి! మూడు నెలలు నల్లమలలోకి నో ఎంట్రీ

Nallamala విధాత‌: పులిరాజాకు సిగ్గెక్కువ.. ప్రియురాలితో చాటుగా చెట్లమాటున సరసమాడే వేళయింది. ఇప్పుడు ఇటు రాకండి అంటూ అటవీ, పర్యాటక శాఖ వాళ్ళు చెబుతున్నారు. పులి రాజు వీరత్వానికి ప్రతీక.. వేటాడే తీరు చుస్తే ఔరా అని అబ్బురపడాల్సిందే.. ఎంతటి పెద్ద పులి అయితేనేం.. ప్రియురాలితో ముచ్చట్లాడే వేళ సిగ్గు ఉండదా.. బిడియం ఉండదా. తనకు ప్రైవసీ ఉండొద్దా. అవును .. ఉండాలి మరి.. ఇప్పుడు పర్యాటక, అటవీ శాఖ వాళ్ళు అదే అంటున్నారు. నల్లమలలో శ్రీశైలం […]

  • Publish Date - July 2, 2023 / 01:33 AM IST

Nallamala

విధాత‌: పులిరాజాకు సిగ్గెక్కువ.. ప్రియురాలితో చాటుగా చెట్లమాటున సరసమాడే వేళయింది. ఇప్పుడు ఇటు రాకండి అంటూ అటవీ, పర్యాటక శాఖ వాళ్ళు చెబుతున్నారు. పులి రాజు వీరత్వానికి ప్రతీక.. వేటాడే తీరు చుస్తే ఔరా అని అబ్బురపడాల్సిందే.. ఎంతటి పెద్ద పులి అయితేనేం.. ప్రియురాలితో ముచ్చట్లాడే వేళ సిగ్గు ఉండదా.. బిడియం ఉండదా. తనకు ప్రైవసీ ఉండొద్దా. అవును .. ఉండాలి మరి.. ఇప్పుడు పర్యాటక, అటవీ శాఖ వాళ్ళు అదే అంటున్నారు.

నల్లమలలో శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి రాకండి.. మా పులిరాజా సరసానికి వేళయింది. మీరొచ్చి డిస్టర్బ్ చేయవద్దని అధికారులు కోరుతున్నారు. నల్లమల అడవులు దేశంలో ఉన్న పులుల సంరక్షణ కేంద్రంలో ప్రముఖమైనది. ఈ అడవుల్లో చిరుతలు, పెద్దపులులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అద్భుతమైన ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు.

విస్తృతమైన ఈ అడవులు కర్నూలు, గుంటూరు, కడప, మహాబుబ్‌నగర్, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాల నడుమనే శ్రీశైలం ఆలయం ఉంది. ఆ ప్రాంతంలోనే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఈ అడవుల్లో పులులు చిరుతలు తరచూ పర్యాటకులకు తారస పడుతుంటాయి.

ఐతే ఇన్నాళ్లూ వస్తే వచ్చారు కానీ ఇక నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమల అడవుల్లోని పర్యాటక ప్రదేశాలన్నింటిలోకి ప్రవేశాన్ని జాతీయ పెద్ద పులుల సంరక్షణ సంస్థ (NTCA) నిలిపి వేస్తోంది.

పులులు, వన్య ప్రాణుల కలయిక కాలం ( గర్భందాల్చే కాలం) కాబట్టి నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయరణ్యలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నింటిలో మానవ సంచారాన్ని మూడు నెలల పాటు నిషేధం విధించింది. అంతేకాకుండా శ్రీశైలం వచ్చిన భక్తులు వారు సమీపంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మ వారి దర్శనం కోసం వెళ్తుంటారు.. జంగిల్ రైడ్ కోసమూ వెళ్తారు. అయితే.. ఇప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్లడాన్ని అధికారులు నియంత్రించారు.

ఈ మూడు నెలలు పులులు గర్భం దాల్చే సమయం. ఈ కాలంలో అడవుల్లో జనసంచారం ఉంటె పులుల ఏకాంతానికి భంగం కలుగుతుందని, దీంతో అవి భయపడి ప్రియురాలితో రొమాన్స్ చేసేందుకు ఇష్టపడక పోవచ్చునని గుర్తించిన అధికారులు ఇక పులులకు ఏకాంతాన్ని కల్పిస్తూ జన సంచారాన్ని నియంత్రిస్తున్నారు.

Latest News