Site icon vidhaatha

డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాని ములుగు కలెక్టరేట్ ఎదుట‌ JAC ధర్నా

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా చేపట్టారు. ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్‌లు వెంటనే పూర్తి చేసి, నిరుపేదలంద‌రికి కేటాయించాలని అన్నారు.

జిల్లావ్యాప్తంగా అర్హులైన పేదల జాబితా వెంటనే ప్రకటించాలని కోరారు. ధర్నా కార్యక్రమానికి మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు శనిగరపు నరేష్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి బోట్ల కార్తిక్, మహాజన సోషలిస్ట్ పార్టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నరసయ్య మాదిగ, నాయకపోడు పోడుదెబ్బ రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు మధు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న మోహన్, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

డ‌బుల్ బెడ్రూమ్‌ల పూర్తి ఎప్ప‌డు..?

గత ఎనిమిది సంవత్సరాల క్రితం చందులాల్ మంత్రిగా ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూమ్‌లు మంజూరు అయితే ఇప్పటివరకు పూర్తి చేయలేదని ధర్నాను ఉద్దేశించి ములుగు జిల్లా జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి గౌడ్ అన్నారు. ఇంకెన్ని సంవత్సరాలకు డబుల్ బెడ్ రూమ్‌లు పూర్తి చేస్తారు అని ప్రశ్నించారు. ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంద‌ని మండిప‌డ్డారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూంలు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమం లో పాల్గొన్న నాయకులు మొలుగూజు రత్న, గద్దల లక్ష్మి, అరుణ, విజయ, రాధక్క, మహిళా సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version