విధాత: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎట్టకేలకు డబుల్ డెక్కర్ బస్సు (Double Decker Bus) లో అందుబాటులోకి వచ్చాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చేలా హెచ్ఎండీఏ అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
ఈ విషయాన్ని హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా నిన్న వెల్లడించారు. రూ. 12.96 కోట్లతో గతంలోనే ఆరు డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండీఏ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Isn’t this a pleasant sight ?
E-double deckers on Hyd roads …