విధాత: అసలే మద్య నిషేధిత రాష్ట్రం. అందులో ఎక్సైజ్ పోలీసులు. స్టేషన్‌లోనే నిందితులతో కలిసి మందు పార్టీ చేసుకున్న ఘటన చర్చనీయాంశం అవుతున్నది. బీహార్ పాట్నా జిల్లా పాలిగంజ్‌లో ఎక్సైజ్ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
రాత్రి కాగానే మద్యం ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కానీ పోలీసులు, నిందితులు కలిసి మందు పార్టీలో మునిగిపోయారు. అరెస్టు అయిన నిందితుల్లో ఒకడు తాను స్టేషన్‌లో బాగానే ఉన్నానని తెలియజేసేందుకు తాను చేసుకుంటున్న మందు పార్టీని వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపాడు.
అది ఆ సెల్లు, ఈ సెల్లు దాటి పోలీసులకు చేరింది. దాంతో పోలీసులు ఎక్సైజ్ స్టేషన్‌పై దాడి చేసి ఏడుగుర్ని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మధ్య నిషేధిత రాష్ట్రంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన పట్ల అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.