Site icon vidhaatha

Snake Drink Beer: పాముకు బీరు తాగించి..ముద్దు పెట్టి..మెడలో వేసుకుని తాగుబోతు హల్చల్ !

విధాత : తాగుబోతుల తిక్క ఒక్కోసారి సాటి మనుషులకే విసుగు తెప్పిస్తూ వారికి దూరంగా జరిగేలా చేస్తుంది. ఓ విష సర్పం సైతం ఓ తాగుబోతుతో తనకెందుకు వచ్చిన తంటా అనుకుందేమోగాని..అతడి పిచ్చి చేష్టలను సహనంతో భరించడం వైరల్ గా మారింది. తమిళనాడులోని ధర్మపురిలో సూర్య అనే యువకుడు మెడలో పాము వేసుకుని కలకలం రేపాడు. అంతేకాదు మెడలో పామును ధరించే వైన్స్ షాపు వద్దకు వెళ్లి ఓ బీరు కొనుగోలు చేసి.. తను తాగడంతో పాటు ఆ పాముకు తాగించి దానికి ముద్దు పెట్టాడు. అనంతరం రోడ్డుపై వాహనాలను ఆపుతూ హల్‌చల్ చేశాడు. ఈ తతంగం అంతా చూసిన స్థానికులు ఈ తాగుబోతు ధైర్యానికి విస్మయం వ్యక్తం చేస్తూనే అతడి తిక్క చేష్టల పట్ల అసహానం వ్యక్తం చేశారు.

అయితే ఆ తాగుబోతు తనకు బీరు తాగించడంతో పాటు రోడ్ల వెంట బలాదూర్ గా తిప్పుతున్నప్పటికి అతని మెడలో ఉన్న పాము మాత్రం అతడిని ఏం అనకుండా మిన్నకుండిపోవడం అందరిని అశ్చర్యానికి గురి చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ బహుశా అది నిరసంగా ఉందని కొందరు..బీరు తాగి మత్తులోకి జారుకుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Infighting in government | రేవంత్‌ రెడ్డికి మంత్రుల మద్దతు ఏది? బీఆరెస్‌ విమర్శలకు కౌంటర్‌ ఏది?
Snake Bite First Aid | పాము కాటేస్తే చేయాల్సినదేంటి? చేయకూడనిదేంటి?
Snake Dens | దాదాపు లక్షన్నర పాములు ‘కలిసే’ అతిపెద్ద ‘పాముల జాత‌ర’ ఎక్కడో తెలుసా?

Exit mobile version