Ongole | అసలోడు వచ్చేవరకు.. కొసరోడికి పండుగే

Ongole ఒంగోలులో లోకేష్‌కు ఫ్లెక్సీల చికాకులు జూనియర్‌తో పోలుస్తూ పోస్టర్స్ విధాత‌: నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ వంటివారి ప్రస్తావన, ఉనికిని ఎంత వద్దనుకుని వాళ్ళను దూరంపెడుతున్నా వాళ్ళు ఏదో రూపంలో లోకేష్ ను చంద్రబాబును చికాకు పెడుతూనే ఉన్నారు. తెలుగుదేశంలో నందమూరి కుటుంబానికి నామమాత్రపు ప్రమేయాన్ని కల్పిస్తూ వారి అభిమానుల ఓట్లను, ఇమేజిని సొంతం చేసుకుంటూ పార్టీని తన కంట్రోల్లో ఉంచుకున్న చంద్రబాబు తన కుమారుడికి మాత్రం ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ భవిష్యత్ నాయకుడిగా ప్రజల్లోకి […]

  • Publish Date - July 18, 2023 / 04:23 AM IST

Ongole

  • ఒంగోలులో లోకేష్‌కు ఫ్లెక్సీల చికాకులు
  • జూనియర్‌తో పోలుస్తూ పోస్టర్స్

విధాత‌: నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ వంటివారి ప్రస్తావన, ఉనికిని ఎంత వద్దనుకుని వాళ్ళను దూరంపెడుతున్నా వాళ్ళు ఏదో రూపంలో లోకేష్ ను చంద్రబాబును చికాకు పెడుతూనే ఉన్నారు. తెలుగుదేశంలో నందమూరి కుటుంబానికి నామమాత్రపు ప్రమేయాన్ని కల్పిస్తూ వారి అభిమానుల ఓట్లను, ఇమేజిని సొంతం చేసుకుంటూ పార్టీని తన కంట్రోల్లో ఉంచుకున్న చంద్రబాబు తన కుమారుడికి మాత్రం ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ భవిష్యత్ నాయకుడిగా ప్రజల్లోకి ఫోకస్ చేస్తున్నాడు.

నందమూరి కుటుంబానికి చెందిన బామ్మర్ది బాలకృష్ణ ను మాత్రమే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి అక్కడికక్కడే కంట్రోల్ చేశారు. ఇక లోకేష్ ను పాదయాత్ర పేరిట జనంలోకి పంపుతూ ప్రజానాయకుడిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు గట్టిగా సాగుతున్నాయి. ఈ తరుణంలో లోకేష్ తన పయనం తానూ సాగిస్తూ ప్రజలతో మమేకమ్ అవుతున్నాయి.

అయినా సరే దారిమధ్యలో లోకేష్ కు, ఎక్కడైనా బహిరంగ సభ పెడితే చంద్రబాబుకు ఇంకా హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ అభిమానులు స్పీడ్ బ్రేకర్లు వేస్తూ.. చెవిలో జోరీగల్లా ఇరిటేట్ చేస్తూనే ఉన్నారు. తాము మర్చిపోదామన్నా మర్చిపోనివ్వకుండా జూనియర్ అభిమానులు తలనొప్పులు తెస్తున్నారు.

ఆమధ్య గుడివాడలో బహిరంగ సభలో జూనియర్… హరికృష్ణ ఫొటోలతో నినాదాలు చేసిన వారిని చంద్రబాబు అగ్రహించి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఇక విజయవాడలో జరిపిన పెద్ద ఎన్టీయార్ శత జయంతి సభలకూ జూనియర్ ను పిలవకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న అయన అభిమానులు.. ఇదిగో ఇప్పుడు ఒంగోలు జిల్లాలో రివెంజ్ తీర్చుకున్నారు. అద్దంకి బస్టాండ్, చర్చి సెంటర్ లలో లోకేష్ ను చిన్నబుచ్చేలా ఉండే ఫ్లెక్సీలు కట్టారు.

అసలోడు వచ్చేవరకు కొస రోడికి పండగే.. కాబోయే సీఎం జూనియర్ అంటూ ఫ్లెక్సీలో రాసారు. అంటే జూనియర్ మాత్రమే పార్టీకి అసలైన వారసుడు అని, ఇప్పుడున్న చంద్రబాబు, లోకేష్ లు కొసరోళ్లు అన్నది జూనియర్ అభిమానుల అభిప్రాయంగా ఉంది. మున్ముందు జూనియర్ మాత్రమే పార్టీని నడిపిస్తాడు అని, సీఎం అవుతాడు అని వారి భావన. అయితే ఈ ఫ్లెక్సీలను లోకేష్ అభిమానులు, కార్యకర్తలు వెంటనే తొలగించారు.

Latest News