Site icon vidhaatha

యాదాద్రిలో ఘనంగా ధ్వజారోహణం

భేరీ పూజ..దేవతాహ్వానం

విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు మంగళవారం ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రయుక్తంగా నూఃతన ధ్వజాపట ఆరోణంతో గరుడాళ్వార్‌ను ఆహ్వానించి గరుడ ముద్దలను నివేదించారు. అనంతరం మంత్రపఠనం. వాయిద్యములతో భేరీపూజతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించే వేడుక నిర్వహించారు. దేవత పరివారానికి పంచసూక్త పఠనంలతో హవిస్సులు అందచేసి వారిని సంతృప్తి పరిచే హవనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం నుంచి స్వామివారికి అలంకార, వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. బుధవారం మత్స్యావతారం, శేషవాహన సేవలు నిర్వహించనున్నారు.

Exit mobile version