Site icon vidhaatha

MiG-29 | శ్రీ‌న‌గ‌ర్ బేస్‌లో.. మిగ్‌-29 స్క్వాడ్ర‌న్‌ను ఏర్పాటు చేసిన వాయుసేన‌..

MiG-29 | అభివృద్ధి ప‌రిచిన మిగ్ 29 (MIG-29) ఫైట‌ర్ జెట్ల స్క్వాడ్ర‌న్‌ను వాయుసేన (Indian Air Force) శ్రీ‌న‌గ‌ర్ బేస్‌లో ఏర్పాటు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ మిగ్ 21 జెట్‌లు సేవ‌లందించ‌గా.. ఇప్పుడు ఆ బాధ్య‌త‌ను మిగ్ 29 స్క్వాడ్ర‌న్ తీసుకోనుంది. సాధార‌ణంగా శ్రీ‌న‌గ‌ర్ బేస్‌ను డిఫెండ‌ర్ ఆఫ్ నార్త్ అని పిలుస్తారు. పాక్ నుంచి వ‌చ్చే ముప్పును అడ్డుకోవ‌డ‌మే దీని ప్ర‌ధాన ఉద్దేశం.

శ్రీ‌న‌గ‌ర్ అనేది క‌శ్మీర్‌లోయ మ‌ధ్య భాగంలో ఉంటుంది. చుట్టు ప‌క్క‌ల ఉన్న మైదాన ప్రాంతాల‌తో పోలిస్తే.. ఇది చాలా ఎత్తైన ప్ర‌దేశంలో ఉంటుంది. ఎక్కువ వెయిట్ – థ్ర‌స్ట్ నిష్ప‌త్తి ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇక్క‌డ అత్య‌వ‌స‌రం. శ‌త్రువు దాడి చేస్తే మ‌న‌కు త‌క్కువ ప్ర‌తిస్పంద‌న స‌మ‌యమే ల‌భిస్తుంది.

అందుకే శ‌క్తిమంత‌మైన ఇంజిన్లు, దీర్ఘ శ్రేణి క్షిప‌ణుల‌ను క‌లిగిఉన్న యుద్ధ విమానాలు అవ‌స‌రం. అందుకు స‌రిగ్గా స‌రిపోతాయ‌నే మిగ్ 29 విమానాల‌ను ఇక్క‌డ మోహ‌రించాంస‌ అని వాయుసేన పైల‌ట్ స్క్వాడ్ర‌న్ లీడ‌ర్ విపుల్ శ‌ర్మ వివ‌రించారు. 2019లో బాలాకోట్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ సంద‌ర్భంగా ఎఫ్ 16ను కూడా కూల్చేసిన స‌త్తా మిగ్ 29 సొంతం.

ఈ విమానాల‌కు ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ క్షిప‌ణుల‌ను అనుసంధానించి ఏక‌కాలంలో దాడి చేయొచ్చు. వీటికి గాలిలోనే ఇంధ‌నం నింపుకోగ‌లిగే సామ‌ర్థ్యం, శ‌త్రువు విమాన సిగ్న‌ల్స్‌ని జామ్ చేసే సామ‌ర్థ్యం ఉన్నాయి. నైట్ విజ‌న్ గాగుల్స్ ఉప‌యోగించి మిగ్ 21 ద్వారా రాత్రి వేళల్లో కూడా ఎక్కువ దూరం చూడ‌గ‌ల‌మ‌ని స్క్వాడ్ర‌న్ లీడ‌ర్ శివ‌రామ్ రానా తెలిపారు.

Exit mobile version