Tamil Nadu | ఓ వైపు ప్ర‌తిప‌క్షాల భేటీ.. మ‌రోవైపు ఈడీ దాడి

Tamil Nadu తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడి నివాసాల్లో ఈడీ సోదాలు నివాసాల వ‌ద్ద భారీ పార‌మిలిట‌రీ బ‌ల‌గాల మోహ‌రింపు విప‌క్షాల భేటీకి హాజ‌రైన త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ విధాత‌: ఒక వైపు వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించ‌మే ల‌క్ష్యంగా విప‌క్ష పార్టీలు ఏక‌మ‌వుతున్న త‌రుణం. బెంగ‌ళూరులో ప్రధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌స‌హా 24 విప‌క్ష పార్టీలు స‌మావేశ‌మైన సంద‌ర్భం. బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహాల‌పై చ‌ర్చిస్తున్న స‌మ‌యం.. మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని […]

  • Publish Date - July 17, 2023 / 01:47 AM IST

Tamil Nadu

  • తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి,
  • ఆయన కుమారుడి నివాసాల్లో ఈడీ సోదాలు
  • నివాసాల వ‌ద్ద భారీ పార‌మిలిట‌రీ బ‌ల‌గాల మోహ‌రింపు
  • విప‌క్షాల భేటీకి హాజ‌రైన త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌

విధాత‌: ఒక వైపు వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించ‌మే ల‌క్ష్యంగా విప‌క్ష పార్టీలు ఏక‌మ‌వుతున్న త‌రుణం. బెంగ‌ళూరులో ప్రధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌స‌హా 24 విప‌క్ష పార్టీలు స‌మావేశ‌మైన సంద‌ర్భం. బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహాల‌పై చ‌ర్చిస్తున్న స‌మ‌యం.. మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ప్ర‌తిప‌క్ష నేతల నివాసాల‌పై దాడులు నిర్వ‌హిస్తున్న‌ది. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కే పొన్ముడితో పాటు ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు సంబంధించిన ఏడు చోట్ల ఈడీ అధికారులు సోమవారం ఉదయం నుంచి సోదాలు నిర్వ‌హిస్తున్నారు.

ఈడీ అధికారులకు అదనపు భద్రత కల్పించేందుకు మంత్రి నివాసం వెలుపల పారామిలటరీ బలగాలను మోహరించారు. ఈ సోదాల‌ వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. కానీ, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

ఏక‌కాలంలో అనేక ప్రాంతాల్లో సోదాలు

ఉదయం 7 గంటలకు ఈ దాడులు ప్రారంభ‌మ‌య్యాయి. డీఎంకే సీనియర్ నేత పొన్ముడి నివాసం, ఆయ‌న కుమారుడు, ఎంపీ గౌతం సిగమణి, ఆయ‌న‌ సమీప బంధువులు, సన్నిహితులు సహా ఆయనకు సంబంధించిన దాదాపు అన్ని చోట్ల ఈడీ అధికారులు ఏక‌కాంలో సోదాలు జ‌రుపుతున్నారు. ’ఇది రాజకీయ ప్రతీకారంతో కూడిన దాడే. డీఎంకే దృఢ నిశ్చయాన్ని పరీక్షించే లక్ష్యం ఈ దాడిలో దాగి ఉన్న‌ది’ అని పార్టీ అధికార ప్రతినిధి శరవణన్‌ తెలిపారు.

బెంగళూరులో ప్రతిపక్ష సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు నుంచే త‌మిళ‌నాడులో ఈ సోదాలు మొద‌ల‌య్యాయి. ఇక్కడ డీఎంకె అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సహా 24 భావ సారూప్యత కలిగిన పార్టీల నాయకులు పాల్గొని, 2024 లోక్‌సభ ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై చర్చించనున్నారు. ఈడీ దాడులు జరుగ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.

భూకబ్జా కేసులో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారిస్తున్న చెన్నైలోని ప్రత్యేక కోర్టు పొన్ముడితో పాటు మరో ఆరుగురిని నిర్దోషులుగా పేర్కొంటూ గత వారం తీర్పునిచ్చింది. డీఎంకే నాయకుడు, ఇతరులను కోర్టు విడుదల చేసింది. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ‌ మాజీ మంత్రి వీ సెంథిల్ బాలాజీ నివాసంలో ఈడీ సోదాలు చేసిన ఒక నెల తర్వాత ఇప్పుడు డీఎంకే సీనియర్ నేత పొన్ముడి ఆస్తుల‌పై సోదాలు నిర్వ‌హించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది

Latest News