Twitter | ఇక నుంచి ట్విట్టర్‌ ద్వారా ఉద్యోగ నియామ‌కాలు: కొత్త ఫీచర్‌ తెచ్చిన మస్క్‌

Twitter | ప్రొఫెష‌న‌ల్ నెట్వ‌ర్కింగ్ ఫీచ‌ర్‌ను ఇచ్చిన మ‌స్క్‌ విధాత:ఎలాన్ మ‌స్క్ (Elon Musk) ఆధ్వ‌ర్యంలో కొత్త పుంత‌లు తొక్కుతున్న ఎక్స్ (ట్విట‌ర్‌)లో స‌రికొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది. ప్రొఫెష‌న‌ల్ నెట్వ‌ర్కింగ్‌ను ఏర్ప‌ర‌చుకోవ‌డానికి యూజ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఫీచ‌ర్‌ను అందుబాటులోకి . ఈ ఫీచ‌ర్ తీసుకువ‌స్తున్న‌ట్లు యాజ‌మాన్యం ఎక్స్‌ (X) లో పోస్ట్ చేసింది. దీని ద్వారా సంస్థ‌లు ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డానికి,, నియామ‌క ప్ర‌క్రియ చేప‌ట్ట‌డానికి అవ‌కాశం ల‌భిస్తుంది. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా ప్రొఫెష‌న‌ల్ నెట్వ‌ర్కింగ్‌లో ఉన్న లింక్డిన్‌, […]

  • Publish Date - August 27, 2023 / 08:38 AM IST

Twitter |

  • ప్రొఫెష‌న‌ల్ నెట్వ‌ర్కింగ్ ఫీచ‌ర్‌ను ఇచ్చిన మ‌స్క్‌

విధాత:ఎలాన్ మ‌స్క్ (Elon Musk) ఆధ్వ‌ర్యంలో కొత్త పుంత‌లు తొక్కుతున్న ఎక్స్ (ట్విట‌ర్‌)లో స‌రికొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది. ప్రొఫెష‌న‌ల్ నెట్వ‌ర్కింగ్‌ను ఏర్ప‌ర‌చుకోవ‌డానికి యూజ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఫీచ‌ర్‌ను అందుబాటులోకి . ఈ ఫీచ‌ర్ తీసుకువ‌స్తున్న‌ట్లు యాజ‌మాన్యం ఎక్స్‌ (X) లో పోస్ట్ చేసింది. దీని ద్వారా సంస్థ‌లు ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డానికి,, నియామ‌క ప్ర‌క్రియ చేప‌ట్ట‌డానికి అవ‌కాశం ల‌భిస్తుంది.

ఇప్ప‌టికే ఈ త‌ర‌హా ప్రొఫెష‌న‌ల్ నెట్వ‌ర్కింగ్‌లో ఉన్న లింక్డిన్‌, నౌక‌రీల‌కు ఎక్స్ గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశ‌ముంది. ఈ ఫీచ‌ర్‌కు ఎక్స్ హైరింగ్ బీటా (X Hiring Beta) అని పేరు పెట్టామ‌ని ఎక్స్ పేర్కొంది. ఎక్స్ హైరింగ్ బీటాను పూర్తిగా ఉప‌యోగించుకోండి. ముఖ్యంగా వెరిఫైడ్ సంస్థ‌లకు ఇది ఉప‌యోగ‌క‌రం. మీకు కావాల్సిన స‌రైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేసుకోవ‌డానికి.. ఎక్స్ కంటే మంచి వేదిక ఏముంటుంది అనే వ్యాఖ్యను జ‌త చేసింది.

దీంతో పాటే రిజిష్ట‌ర్ అవ్వ‌డానికి లింక్‌ను సైతం త‌న పోస్ట్‌లో అందుబాటులో ఉంచింది. ఎక్స్‌ను ఒక సూప‌ర్ యాప్‌గా రూపొందించే క్ర‌మంలో దీనిని ఒక ప‌రిణామంగా నిపుణులు భావిస్తున్నారు. కేవ‌లం ఒక మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌గానే కాకుండా ఎక్స్‌ను అనేక ర‌కాలుగా విస్త‌రించి సూప‌ర్‌యాప్‌గా మారుస్తామ‌ని మ‌స్క్ గ‌తంలోనే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతానికి ఎక్స్ హైరింగ్ బీటా ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకున్న వారికే అందుబాటులో ఉంది. ఏడాదికి రూ.82,000 క‌ట్టిన వెరిఫైడ్ కంపెనీలు మాత్ర‌మే ఇందులో న‌మోదుకావ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఇలా న‌మోదైన వారే త‌మ ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లను ట్విట‌ర్‌లో పోస్ట్ చేసి.. నియామ‌క ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు.

ఏంటి ప్ర‌త్యేక‌త‌?

లింక్డిన్‌, నౌక‌రీల‌కు భిన్నంగా ఎక్స్ ద్వారా నియామ‌కాల్లో ప్ర‌త్యేక‌త ఏంట‌నే ప్ర‌శ్న‌కు సంస్థ అంత‌ర్గ‌త వ‌ర్గాలు వివ‌ర‌ణ ఇచ్చాయి. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్స్ (ఏటీస్‌) అనే సాంకేతిక‌త సాయంతో ఎక్స్ ఎం ఎల్
స‌మాచారం ఆధారంగా సంస్థ‌లు త‌మ నియామ‌క ప్ర‌క్రియ‌ను లోప‌భూయిష్ఠ ర‌హితంగా చేసుకోడానికి అవ‌కాశం ఉంటుంద‌ని వెల్ల‌డించాయి. ఇప్పుడున్న ఏ ప్రొఫెష‌న‌ల్ నెట్వ‌ర్కింగ్ సైట్ల‌లోనూ ఈ ఏర్పాటు లేద‌ని తెలిపాయి.

Apply for the Beta today

Latest News