Employment | ఐదేండ్ల‌లో ఉపాధి వృద్ధి సున్నా

భార‌తదేశ యువ‌త‌ను నిరుద్యోగం వేధిస్తున్న‌ది. కొత్త ఉపాధి అవకాశాలు లేక‌ ఎన్ని డిగ్రీలు ఉన్నా ఇంటి వ‌ద్దే ఖాళీగా ఉండాల్సి వ‌స్తున్న‌ది.

  • Publish Date - January 29, 2024 / 09:38 AM IST

  • జీడీపీ 18 శాతం పెరిగినా కొత్త ఉద్యోగాలు లేవు
  • 2019 క‌రోనా స‌మ‌యంలో తీవ్రంగా నిరుద్యోగ పరిస్థితి

Employment | విధాత‌: భార‌తదేశ యువ‌త‌ను నిరుద్యోగం వేధిస్తున్న‌ది. కొత్త ఉపాధి అవకాశాలు లేక‌ ఎన్ని డిగ్రీలు ఉన్నా ఇంటి వ‌ద్దే ఖాళీగా ఉండాల్సి వ‌స్తున్న‌ది. దేశంలో గ‌డిచిన ఐదేండ్ల‌లో స్థూల దేశీయోత్ప‌త్తి (జీడీపీ) 18 శాతం పెరిగిన‌ప్ప‌టికీ ఉపాధి క‌ల్ప‌న‌లో సున్నా అభివృద్ధిని సాధించింది. ఉపాధి క‌ల్ప‌న అంద‌రి హక్కును గుర్తించడం వ‌ల్ల దేశ డీజీపీలో 3% కంటే త‌క్కువ ఖర్చే అవుతుంది. కానీ, ఆ దిశ కేంద్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం మూలంగా నిరుద్యోగం పెరుడంతోపాటు ఆర్థిక వ‌న‌రులు కూడా త‌గ్గుతున్నాయి.


స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా ప్ర‌స్తుతం నిరుద్యోగ ప‌రిస్థితులు ఉండ‌టానికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. క‌రోనా లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన ప‌త‌నం నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌క‌పోవ‌డం, ఉపాధి పునరుద్ధరణ జ‌రుగ‌క‌పోవ‌డం ఇందుకు కార‌ణాలు. 2023-24లో జీడీపీ 2019-20 కంటే దాదాపు 18 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ, గత ఐదేండ్ల‌లో ఉపాధి సున్నా వృద్ధిని చూపిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ తెలిపింది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో పెద్దస్థాయి సంస్థల కంటే చిన్న, మధ్య తరహా సంస్థలలో చాలా సంప‌ద సృష్టి జ‌రిగింది. 2019 నాటికి కూడా నిరుద్యోగ పరిస్థితి తీవ్రంగా మారింది.


రైతులకు, వ్య‌వ‌సాయానికి ప్ర‌భుత్వం స‌బ్సిడీలు ఉపసంహరించుకోవడం వల్ల వ్యవసాయం సంక్షోభంలో ప‌డింది. అది పెద్ద సంఖ్యలో రైతులను వ్య‌వ‌సాయం నుంచి ఇత‌ర రంగాల‌కు మ‌ళ్లించింది. వ్య‌వ‌సాయాన్ని వ‌దిలేసిన గ్రామీణ ప్ర‌జ‌లు ప‌ట్ట‌ణాల‌కు, న‌గ‌రాల‌కు వ‌ల‌స‌లు క‌ట్టారు. ఫ‌లితంగా నిరుద్యోగిత మ‌రింత పెరిగింది.


 


ఉదాహ‌ర‌ణ‌కు 100 మంది కార్మికులను ఉపయోగించి 100 యూనిట్ల ఉత్పత్తిని సాధిస్తే.. అందుబాటులోకి వ‌చ్చిన కొత్త సాంకేతికతతో 50 మంది కార్మికుల‌తో 100 యూనిట్ల ఉత్ప‌త్తి అవుతున్న‌ది. ఫ‌లితంగా 50 మంది నిరుద్యోగులుగా మారిపోతున్నారు. నిరుద్యోగిత పెరుగుదల కారణంగా కూలీల వేతన రేటు మునుపటి కంటే ఎక్కువగా పెరుగ‌దు. కార్మిక ఉత్పాదకత పెరుగుదల కారణంగా మొత్తం వేతన బిల్లు సగానికి తగ్గుతుంది. అలాగే లాభాల వాటా పెరుగుతుంది.


సుప్రసిద్ధ ఆంగ్ల ఆర్థికవేత్త డేవిడ్ రికార్డో ప్ర‌కారం.. యంత్రాల ప్రవేశం ( సాంకేతిక మార్పు) నిరుద్యోగానికి కారణమైందని అంగీకరిస్తూనే, ఇటువంటి యాంత్రీక‌ర‌ణ‌తో ఉత్పన్నమయ్యే అధిక లాభాలు పెట్టుబడిని పెంచుతాయని, అందువల్ల ఉత్పత్తి, ఉపాధి వృద్ధి రేటు పెరుగుతుందని, దీని కారణంగా ఉపాధి క్షీణత తాత్కాలికం మాత్రమే ఉంటుందని చెప్పారు.


 


రాజ్యాంగంలో ఇప్పటికే హామీ ఇచ్చిన రాజకీయ, పౌర హక్కులతో సమానంగా, న్యాయబద్ధమైన ఉద్యోగ హక్కును గుర్తించడం వల్ల దేశానికి జీడీపీలో 3 శాతం కంటే ఎక్కువ ఖర్చు ఉండదు. ఒక నిరుద్యోగ కార్మికుడికి ఇవ్వాల్సిన సగటు వేతనం నెలకు రూ. 20,000గా తీసుకుంటే, 10 శాతం నిరుద్యోగిత రేటు త‌గ్గుతుంది. దాదాపు నాలుగు కోట్ల నిరుద్యోగులకు ఆర్థిక వనరులు స‌మ‌కూరుతాయి.


నిరుద్యోగులందరికీ ఈ వేతనం చెల్లిస్తే అది రూ. 9.6 లక్షల కోట్లు అవుతుంది. ఇది 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం అధికారికంగా అంచనా వేసిన జీడీపీలో 3.2%కి వస్తుంది. చాలా మంది నిరుద్యోగులకు కొనుగోలు శక్తిని పెర‌గ‌డం వ‌ల్ల , వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. లబ్ధిదారులు ఖర్చు చేయడం వల్ల మిగిలిన వారికి ఉద్యోగాలు లభిస్తాయి. జీడీపీ కూడా పెరుగుతుంది.

Latest News