Site icon vidhaatha

TSPSC | టీఎస్‌పీఎస్సీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీపై ఈడీ విచార‌ణ‌.. శంక‌ర‌ల‌క్ష్మి వాంగ్మూలం న‌మోదు

TSPSC | టీఎస్‌పీఎస్సీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌) విచార‌ణ గురువారం ప్రారంభ‌మైంది. టీఎస్‌పీఎస్సీ కార్యాల‌యంలో ప‌ని చేస్తున్న కాన్ఫిడెన్షియ‌ల్ సెక్ష‌న్ ఇంచార్జి శంక‌ర‌ల‌క్ష్మిని ఈడీ అధికారులు గురువారం సుదీర్ఘంగా విచారించారు. రాత్రి పొద్దుపోయే దాకా ఆమెను విచారించి, వాంగ్మూలాన్ని న‌మోదు చేశారు. సిట్(ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం) న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.

అయితే న్యాయ‌స్థానం నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న ఈడీ ఆ వివ‌రాల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్టు న‌మోదు చేసింది. అనంత‌రం శంక‌ర‌ల‌క్ష్మి, అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ లేదా గురువారాల్లో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసుల్లో పేర్కొంది. వీరిద్ద‌రూ బుధ‌వారం విచార‌ణ‌కు రాలేదు. గురువారం మాత్రం శంక‌ర‌ల‌క్ష్మీ ఒక్క‌రే విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మ‌ధ్యాహ్నం 3 నుంచి రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు విచారించి, వాంగ్మూలాన్ని న‌మోదు చేశారు.

ఆమె నుంచి కాన్ఫిడెన్షియ‌ల్ సెక్ష‌న్ విధివిధానాల గురించి, ప్ర‌శ్న‌ప‌త్రాలు ఎలా కొట్టేశార‌నే విష‌యాల‌పై ఈడీ ప్ర‌శ్నించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. విచార‌ణ‌కు హాజ‌రుకాని స‌త్య‌నారాయ‌ణ‌కు మ‌రోసారి ఈడీ నోటీసులు జారీ చేసే అవ‌కాశం ఉంది.

Exit mobile version