Site icon vidhaatha

Spain | ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 చాంపియ‌న్‌గా స్పెయిన్.. ఇంగ్లండ్‌ని ఓడించి ట్రోఫీ కైవ‌సం

Spain | Women’s World Cup

ఫిపా ఉమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఎంత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుందో మ‌నం చూశాం. సుమారు నెలపాటు ఈ ప్రపంచకప్‍లో హోరాహోరీ మ్యాచ్‍లు జరగగా.. ఇంగ్లండ్, స్పెయిన్ తుదిపోరుకు వచ్చాయి. ఫుట్‍బాల్ మహిళల ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్‍కు చేరడం ఇంగ్లండ్, స్పెయిన్‍కు ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఫుట్‍బాల్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు.

అయితే హోరా హోరీగా సాగిన మ్యాచ్‌లో స్పెయిన్ జ‌ట్టు విజేత‌గా నిలిచింది. సిడ్నీ వేదిక‌గా ఈ రోజు జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ని 1-0 తేడాతో ఓడించింది స్పెయిన్. మ్యాచ్ 29వ నిమిషంలో ఓల్గా క్యార్‌మోనా అద్భుత‌మైన గోల్ చేసి స్పెయిన్ విజ‌యానికి కార‌ణ‌మ‌య్యారు. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవ‌రేట్ అయిన ఇంగ్లండ్ ఫైన‌ల్ మ్యాచ్‌లో పూర్తిగా నిరాశ‌ప‌ర‌చింది.

Exit mobile version