విధాత, హైదరాబాద్ : గద్దర్ అవార్డ్స్ కోసం దరఖాస్తు చేసిన సినిమాల్లో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ సెలక్షన్ కమిటీ జ్యూరీ మెంబర్స్ గా కూడా ఉండటం.. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ఎంపికలో పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తుందని ఫిల్మ్ డైరక్టర్ సయీద్ రఫీ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులు లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. దరఖాస్తుదారులతో అవార్డుల ఎంపిక కమిటీ వేసిన తీరు కమిటీ వేసిన వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. సభ్యులందరూ కలిసి మొత్తం సినిమాలను వీక్షించకుండానే, హాజరు అయినట్లు సంతకాలు పెట్టి వెళ్లిపోవడం..పట్టు పట్టి మరీ ఒక సినిమాకు అవార్డు వచ్చేలా ఒత్తిడి తేవడం పారదర్శకమా? అని రఫీ ప్రశ్నించారు.
అవార్డుల ఎంపిక ప్రహాసనంతో తెలంగాణ ప్రజా ధనం వృధా అని..వీరి నిర్ణయం, ప్రజా యుద్ధ నౌక గద్దర్ కి పెద్ద అవమానం అని రఫీ మండిపడ్డారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం జాగ్రత పడవలసిన సందర్భం ఇదని రఫీ పేర్కొన్నారు.