Site icon vidhaatha

Bhattacharya | మెరుగ్గా బుద్ధదేవ్‌ ఆరోగ్యం

Bhattacharya

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య ఆరోగ్యం మంగళవారం మెరుగైంది. ఆయకు పెట్టిన వెంటిలేషన్‌ను తొలగించాలనే ఆలోచనలో ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు ఉన్నారు. భట్టాచార్య వయసు 79 సంవత్సరాలు. ఇతరరత్రా ఏమైనా ఇన్‌ఫెక్షన్లు సోకాయా? అనే అంశం తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయనకు వైద్యం అందిస్తున్న బృందంలోని సీనియర్‌ వైద్యుడు తెలిపారు. పరీక్షల్లో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

భట్టాచార్య ఆరోగ్యం చాలా బాగా మెరుగైందని ఆయన అన్నారు. సోమవారం రాత్రి ఆయన చక్కగా నిద్రపోయారని తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నారని, సృహలో ఉన్నారని వెల్లడించారు. 2000 సంవత్సరంలో జ్యోతిబసు నుంచి బాధ్యతలు తీసుకున్న బుద్ధదేవ్‌.. బెంగాల్‌ ముఖ్యమంత్రిగా 2011 వరకు కొనసాగారు. అప్పటి ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించి.. మమతాబెనర్జీ సీఎం అయ్యారు.

ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నేళ్లుగా బుద్ధదేవ్‌ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన వామపక్షాల ర్యాలీకి ఆక్సిజన్‌ సహాయంతో వచ్చి కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేశారు. 2015లో పార్టీ పొలిట్‌బ్యూరో నుంచి, 2018లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం నుంచి ఆయన వైదొలిగారు.

Exit mobile version