Site icon vidhaatha

Rasi Phalalu: 26.02.2025, బుధవారం.. శివ‌రాత్రి రోజున మీ రాశి ఫలాలు! వారికి అదనపు ఆదాయాలు, వృత్తి, వ్యాపారాల్లో వృద్ది

Rasi Phalalu|

జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి చెర‌గ‌ని నమ్మకం ఉంది. లేచినప్ప‌టి నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం.అందుకే ప్ర‌తీ రోజూ మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల మీద ఈ రోజు శివ‌రాత్రి (బుధ‌వారం, ఫిబ్ర‌వ‌రి 26) న‌ మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం
వ్యక్తిగత సమస్యలు పరిష్కారం. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం. రుణబాధలు పోతాయి. ప్రయత్నకార్యాలు స‌ఫలం. ఆనందంగా వైవాహికజీవనం ఆకస్మిక ధనలాభం. కొత్త వ్యాపారాలకు శ్రీకారం.

వృషభం
ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు. స్థానచలన సూచనలు. సన్నిహితులతో విరోధం రాకుండా మెలగాలి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు. ఆకస్మిక ధననష్టం. ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలి. స్వల్ప అనారోగ్యబాధలు. వృధాప్రయాణాలు. ఒత్తిడి నుంచి ఉపశమనం.

మిథునం
ఆర్థిక లావాదేవీల్లో లాభాలు కానీ ఇత‌రుల‌కు వాగ్దానాలు చేయొద్దు. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య బాధలు అధికం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు. అకారణంగా కలహాలు, అనవసర భయాలు. చంచలంగా విద్యార్థులు. లాభాల బాటలో వ్యాపారాలు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. అనవసర ఖర్చులు, నష్టాలు ఉంటాయి.

కర్కాటకం
ఆశాజనకంగా వ్యాపారాలు, బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక కలహాలకు అవకాశం. ప్రముఖులతో పరిచయాలు ధన నష్టాలు. రుణ ప్రయత్నాలు ఎక్కువ‌. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. విద్యార్థులకు శ్రమ తప్పదు. కుటుంబ విషయాల్లో మార్పులు. తలపెట్టిన వ్యవహారాలు, పనులు ఆల‌స్యం.

సింహం
ప్రోత్సాహకరంగా ఉద్యోగ జీవితం. అనుకున్న‌వి జరుగ‌వు. స్వల్పంగా అనారోగ్య బాధలు. వృత్తి, వ్యాపారాల్లో వృద్ధి. వేళకు భోజ‌నానికి ప్రాధాన్యత‌. మ‌న‌సు చంచలం వల్ల ఇబ్బందులు. ఆదాయానికి లోటుండదు. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం. పిల్లల విష‌యంలో శ్రద్ధ ఉంచాలి. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది.

కన్య
ఉద్యోగంలో పని భారం, ఒత్తిడి. స్త్రీల వ‌ళ్ల ధన లాభం. ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. నిలకడగా వృత్తి, వ్యాపారాలు. వృత్తి, ఉద్యోగరంగాల్లో వృద్ధి. ఆత్మీయులను కలవడంలో విఫలం. వృత్తిలో తీరిక ఉండదు. ఆశించిన స్థాయిలో లాభాలు. అనవసర వ్యయప్రయాసలు. వృథా ప్రయాణాలు ఎక్కువ. సవ్యంగా ముఖ్యమైన వ్యవహారాలు. మెరుగ్గా ఆర్థిక పరిస్థితి.

తుల
ఆస్తి వివాదం పరిష్కారం. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో వృద్ధి. ఆకస్మిక ధన లాభం. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుత అవకాశాలు. అన్నింటా విజయం. బంధు, మిత్రులు కలుస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో మార్పుల‌తో లబ్ధి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు. ప్రముఖులతో పరిచయాలు.

వృశ్చికం
నిలకడగా ఆదాయం. వ్యాపార కార్యకలాపాల్లో వృద్ది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరం. వృత్తి జీవితంలో డిమాండ్. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ. అధికారుల నుంచి గుర్తింపు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రహస్య శతృబాధలు. రుణప్రయత్నాలు ఆలస్యం. కుటుంబంలో అశాంతి. ప్రయాణాల వల్ల లాభాలు. బంధువులతో అపార్థాలు, ఆరోగ్య స‌మ‌స్య‌లు.

ధనుస్సు
వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు. లాభసాటిగా వ్యాపారాలు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో విందులు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదం పరిష్కా రమయ్యే అవకాశం. కొత్త‌ వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి. సులభంగా శుభకార్య ప్రయత్నాలు. సవ్యంగా ఆర్థిక వ్యవహారాలు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు.

మకరం
నిలకడగా వ్యాపారాలు. నూతన కార్యాలు ఆలస్యం. అల్పభోజనం వల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు. పెద్దల నుంచి ఆశించిన సాయం. ఓ విషయంతో మనస్తాపం. అసత్యానికి దూరంగా ఉండాలి. వ్యక్తిగత సమస్యలు ఓ కొలిక్కి. అనవసర భయాందోళనలు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు, పనిభారం. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి.

కుంభం
పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు. కొత్త‌ వ్యక్తులకు దూరంగా ఉండాలి. మిత్రుల వల్ల డబ్బు నష్టం. ఆర్థిక స‌మ‌స్య‌లు నిదానంగా తీరుతాయి. మనోల్లాసం ఉంటుంది. విద్యార్థుల మీద ఒత్తిడి. సోదరులతో ప్రేమ‌పూర్వ‌కంగా ఉండాలి. కొత్త వ్యూహాలతో వ్యాపారాలంలో పురోగతి. తలచిన కార్యాలకు ఆటంకాలు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సాఫీగా ప్రేమ వ్యవహారాలు.

మీనం
ప్ర‌తీ ప్రయత్నం కలిసి వస్తుంది. కీర్తి, ప్రతిష్ఠలు రెట్టింపు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యాల్లో పాల్గొంటారు. రుణ బాధలు, శత్రు బాధలు ఉండవు. ఆకస్మిక ధనలాభం. పిల్లల నుంచి శుభవార్తలు. కొత్త‌ వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్ర‌శంస‌లు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి.

Exit mobile version