Female Reporter Shot Live: ప్రజల ఆందోళనలను లైవ్ లో చూపిస్తున్న మహిళా రిపోర్టర్ పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన ప్రజాస్వామ్యానికి..ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసన చేస్తున్న ఆందోళనకారులను అడ్డుకోవడం కోసం పోలీసులు, నేషనల్ గార్డ్ దళాల రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు దిగాయి.
ఈ క్రమంలోనే అక్కడ రిపోర్టింగ్ చేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా రిపోర్టర్‌పై రబ్బర్ బుల్లెట్‌తో ఓ పోలీస్ కాల్పులకు తెగబడ్డాడు. లైవ్ లో కెమెరాలో మాట్లాడుతుండగానే వెనుక నుంచి రబ్బర్ బుల్లెట్ కాలుకు తగిలింది. అయితే తాను బాగానే ఉన్నానంటూ అక్కడి నుంచి ఆ మహిళా రిపోర్టర్ పరుగులు తీసింది. అనంతరం కొద్దిసేపు ఆ రిపోర్టర్ రబ్బర్ బుల్లెట్ తాకిడికి నోప్పితో బాధపడింది. ఈ సంఘటన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
An Australian journalist was shot by U.S. police, caught live on camera. So where exactly is that press freedom you preach, U.S.?#LosAngeles #Australia pic.twitter.com/k6XHAhLFI8
— Roasting Man (@Roasting_man123) June 9, 2025