Site icon vidhaatha

Tomato | నేటి నుంచి కిలో టమాటా రూ.40 : కేంద్రం ఆదేశాలు

Tomato

విధాత : దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నేటి నుంచి కిలో టమాటా 40రూపాయలకే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నేషనల్ కోఆపరేటివ్ కన్సూమర్ ఫెడరేషన్‌(ఎన్‌సీసీఎఫ్‌), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌లకు ఆదేశాలిచ్చింది.

కేంద్ర ఆదేశాల మేరకు ఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహార్ రాష్ట్రాలలో ఆదివారం నుంచి కిలో టమాటా 40రూపాయలకే అందుబాటులో ఉండనుంది.

దేశంలో టామాటా ధరలు గత కొన్ని రోజులుగా కిలో 200రూపాయలకు చేరి మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. రైతుబజార్‌లలో 50రూపాయలకు అక్కడక్కడా అమ్మకానికి పెట్టిన ప్రజావసరాలకు అవి సరిపడలేదు.

అయితే కొత్త పంటల రాకతో టామాటా ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. మునుముందు టమాటా ధరలు మరింత తగ్గనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version