సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (G V Prakash Kumar) హీరోగా, దివ్య భారతి (Divyabharathi) కథానాయికగా ఈ కాంబినేషన్‌లో రెండో ప్రయత్నంగా తెరకెక్కుతున్న చిత్రం కింగ్‌స్టన్ (Kingston). ఇండియాలో మొదటి సముద్ర అడ్వంచరస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు కమల్ ప్రకాశ్ (Kamal Prakash) రచన, దర్శకత్వం చేశారు.
జీ స్టూడియోతో కలిసి జీవీ ప్రకాశ్ కుమార్ (G V Prakash Kumar) ఈ మూవీని నిర్మించడంతో పాటు సంగీతం కూడా అందించాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు మంచి మూవీపై మంచి బజ్ తీసుకువచ్చాయి. మార్చి7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. టీజర్‌ను గమనిస్తే సినిమాలో విషయం ఉందని అనిపిస్తోంది.