Site icon vidhaatha

GHMC: ఆస్పత్రులు, షాపింగ్‌ మాల్స్‌కు నోటీసులు

విధాత‌: ఇటీవల నగరంలో అగ్నిప్రమాదాలు జరిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం నేపథ్యంలో పలు ఆస్పత్రులు, షాపింగ్‌ మాల్స్‌కు జీహెచ్‌ఎంపీ నోటీసులు జారీచేసింది. అగ్నిమాపక నిబంధనలు పాటించని భవనాలకు, ఆస్పత్రులు, గోదాములు, షాపింగ్‌మాల్స్‌, సిలిండర్‌ గోదాములు, ఫార్మా, ప్లాస్టిక్‌, రబ్బర్‌ దుకాణాలు ఇలా నగరంలో మొత్తం 19 దుకాణాలు, మాల్స్‌కు ఈవీడీఎం నోటీసులు ఇచ్చింది.

సెల్లార్లు ఖాళీగా ఉంచాలని, అత్యవసర దారులు తెరిచే ఉంచాలని నోటీసుల్లో పేర్కొన్నది. 3 రోజుల్లో సరిచేసుకోకుంటే సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. సికింద్రాబాద్‌లోని ఏఎంఆర్‌ ప్లానెట్‌ కు అక్రమంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేసినందుకు రూ. 50 వేల జరిమానా విధించింది.

Exit mobile version