Aarogyasri| నేటి అర్థరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత

విధాత, హైదరాబాద్ : తెలంగాణ(Telangana)లో ఈ రోజు ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ (Aarogyasri Medical Services)సేవలు ఆగిపోనున్నాయి. ఆరోగ్య శ్రీ నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రుల‌(Hospitals)కు ప్రభుత్వం రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు(Government Due)చెల్లించకపోవడంతో యజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. బకాయిలు చెల్లించకుంటే ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని ఈ నెల 21వ తేదీనే ‘తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (టీఏఎన్‌హెచ్‌ఏ)’ ఆరోగ్యశ్రీ సీఈవోకు లేఖ రాసింది. ఐనప్పటికి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి […]

విధాత, హైదరాబాద్ : తెలంగాణ(Telangana)లో ఈ రోజు ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ (Aarogyasri Medical Services)సేవలు ఆగిపోనున్నాయి. ఆరోగ్య శ్రీ నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రుల‌(Hospitals)కు ప్రభుత్వం రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు(Government Due)చెల్లించకపోవడంతో యజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. బకాయిలు చెల్లించకుంటే ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని ఈ నెల 21వ తేదీనే ‘తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (టీఏఎన్‌హెచ్‌ఏ)’ ఆరోగ్యశ్రీ సీఈవోకు లేఖ రాసింది.

ఐనప్పటికి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ అర్థ‌రాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవ‌లు నిలిపివేయాలని టీఏఎన్‌హెచ్‌ఏ(TANHA)నిర్ణయించాయి. డయాలసిస్‌, ఎమర్జెన్సీ వైద్య సేవలు మినహా మిగతా ఆరోగ్యశ్రీ సేవలన్నీ నిలిపివేస్తున్నట్టు తెలిపాయి. ఆస్పత్రుల నిర్ణయంతో ఆరోగ్యశ్రీ స్కీమ్ లబ్ధిదారులుగా ఉన్న పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు వైద్య సేవల(Health Crisis)విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. ఆస్పత్రుల నిర్ణయంతో ఆరోగ్యశ్రీ , జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీమ్‌, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.