Bihar | ఓ యువకుడు.. ఓ విద్యార్థినిని అపహరించి అత్యాచారం చేశాడు. బాలికను బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలను ప్రధానోపాధ్యాయుడు చూసి అనుసరించాడు. హెడ్‌మాస్టర్‌ను చూసిన ఆ అబ్బాయి అక్కడ్నుంచి పారిపోయాడు. అయితే ప్రధానోపాధ్యాయుడు తనను కాపాడుతాడేమోనని భావించింది బాలిక. కానీ ఆమెపై క్రూర మృగంలా విరుచుకు పడ్డాడు. అత్యాచారం చేసిన అనంతరం చెట్ల పొదల్లోనే బాలికను వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన బీహార్‌లోని కైమూరు జిల్లాలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ 14 ఏండ్ల బాలిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా, మల విసర్జన నిమిత్తం రోడ్డు పక్కకు వెళ్లింది. దీన్నే అనువుగా భావించిన ఓ ఐదుగురు యువకులు.. బాలికను బలవంతంగా అపహరించారు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు. ఐదుగురిలో ఒక యువకుడు బాలికపై అత్యాచారం చేశాడు. అయితే బాలికను చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన దృశ్యాన్ని ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గమనించి ఆ యువకులను అనుసరించాడు. ప్రధానోపాధ్యాయుడిని గమనించిన విద్యార్థులు అక్కడ్నుంచి పారిపోయారు.
అయితే హెడ్‌మాస్టర్‌ను చూసిన వెంటనే బాలికకు ధైర్యం వచ్చింది. తనను రక్షించడానికి వచ్చాడని విద్యార్థినిని భావించింది. కానీ అది జరగలేదు. ఆ ప్రధానోపాధ్యాయుడు కూడా కామంతో చెలరేగిపోయాడు. నగ్నంగా ఉన్న విద్యార్థినిపై క్రూర మృగంలా విరుచుకుపడ్డాడు హెడ్ మాస్టార్. తన కోరికను తీర్చుకున్న అనంతరం బాలికను చెట్ల పొదల్లోనే వదిలేసి వెళ్లిపోయాడు.
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న విద్యార్థిని.. గ్రామంలోకి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. హెడ్ మాస్టార్ సురేంద్ర కుమార్ భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యువకుడి కోసం గాలిస్తున్నారు.