Gold Rates:: బంగారం కొనుగోలు దారులకు కొంత ఊరట లభిస్తుంది. బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం కూడా హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.600తగ్గి రూ.82,250వద్ధ కొనసాగింది. 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.650తగ్గి రూ.89,730వద్ద నిలిచింది. బెంగళూరు, చైన్నై, ముంబైలలో అదే ధర కొనసాగుతోంది. ఢిల్లీలో రూ.82,400గా, రూ.89,880గా ఉంది.
దుబాయ్ లో 22క్యారెట్ల ధర రూ.78,324, 24క్యారెట్లకు 84,579గా ఉంది. అమెరికాలో 22క్యారెట్లకు రూ.77,718, 24క్యారెట్లకు రూ.82,656రూపాయలుగా ఉంది.