పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బంగారం ధరలు మళ్లీ తగ్గాయ్‌..! హైదరాబాద్‌లో నేటి ధరలిలా

  • Publish Date - October 3, 2023 / 04:37 AM IST

విధాత‌: బంగారం ప్రియులకు ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.150 పతనమై తులానికి రూ.53,200కి చేరింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.160 తగ్గి రూ.58,200 తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,190 చేరింది.


ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.53,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,040 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.53,356 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.58,430కి తగ్గింది. బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రూ.53,200 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.58,040 వద్ద కొనసాగుతున్నది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.53,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,040 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. రూ.500 తగ్గి కిలో ధర రూ.73వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.75,500కి చేరింది. మరో వైపు ప్లాటినం ధరలు స్వల్పంగా పెరిగాయి. రూ.170 పెరిగి.. తులం రేటు రూ.24,220 పలుకుతున్నది.