పోలీసు ఉద్యోగాల‌కు ప్రిపేర‌వుతున్న గ‌ర్భిణుల‌కు గుడ్ న్యూస్!

విధాత‌: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల‌కు ప్రిపేర‌వుతున్న గ‌ర్భిణుల‌కు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త వినిపించింది. గ‌ర్భిణుల‌కు ఫిజిక‌ల్ ఈవెంట్స్ నుంచి మిన‌హాయింపును ఇస్తూ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల‌కు ఫిజిక‌ల్ ఈవెంట్స్ ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నిర్వ‌హించిన‌ ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో అర్హ‌త సాధించిన వారిలో ప‌లువురు మ‌హిళ‌లు గ‌ర్భిణులుగా ఉండ‌టంతో ఫిజిక‌ల్ ఈవెంట్స్‌కు హాజ‌రు కాలేక‌పోతున్నారు. దీంతో అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని, ఫిజిక‌ల్ […]

  • Publish Date - December 27, 2022 / 02:11 PM IST

విధాత‌: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల‌కు ప్రిపేర‌వుతున్న గ‌ర్భిణుల‌కు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త వినిపించింది. గ‌ర్భిణుల‌కు ఫిజిక‌ల్ ఈవెంట్స్ నుంచి మిన‌హాయింపును ఇస్తూ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్ర‌క‌టించింది.

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల‌కు ఫిజిక‌ల్ ఈవెంట్స్ ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నిర్వ‌హించిన‌ ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో అర్హ‌త సాధించిన వారిలో ప‌లువురు మ‌హిళ‌లు గ‌ర్భిణులుగా ఉండ‌టంతో ఫిజిక‌ల్ ఈవెంట్స్‌కు హాజ‌రు కాలేక‌పోతున్నారు.

దీంతో అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని, ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొన‌కుండానే మెయిన్స్ రాసేలా అవ‌కాశం క‌ల్పించింది రిక్రూట్‌మెంట్ బోర్డు. మెయిన్స్‌లో ఒక వేళ పాసైతే.. నెల రోజుల్లోపు ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

కోర్టు ఆదేశాల మేర‌కు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది. అధికారుల నియమావ‌ళిని అంగీక‌రిస్తూ గ‌ర్భిణులు లేఖ రాసివ్వాల‌ని నిబంధ‌న విధించారు.