Governor Tamilisai | కుదిరిన‌ రాజీ.. పెండింగ్ బిల్లుల‌పై గవర్నర్‌ త‌మిళిసై క్లారిటీ

Governor Tamilisai | ఇన్నాళ్లూ ఉప్పూ-నిప్పులా ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌- గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మ‌ధ్య రాజీ కుదిరిన‌ట్లు క‌నిపిస్తోంది. రాజ్‌భ‌వ‌న్‌- ప్ర‌గ‌తి భ‌వ‌న్ మ‌ధ్య మైత్రి చిగురిస్తోంది. ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉంచిన బిల్లుల‌ను ఈ నెల 15లోగా క్లియ‌ర్ చేస్తామ‌ని ప్ర‌భుత్వానికి రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు వ‌ర్త‌మానం పంపాయి. గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద పెండింగ్ బిల్లుల‌పై కేసీఆర్‌తో స‌హా ప‌లువురు మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఒక ద‌శ‌లో గ‌వ‌ర్న‌ర్‌పై సుప్రీంకోర్టుకు కూడా కేసీఆర్ ప్ర‌భుత్వం వెళ్లింది. కానీ […]

  • Publish Date - July 10, 2023 / 02:44 PM IST

Governor Tamilisai |

ఇన్నాళ్లూ ఉప్పూ-నిప్పులా ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌- గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మ‌ధ్య రాజీ కుదిరిన‌ట్లు క‌నిపిస్తోంది. రాజ్‌భ‌వ‌న్‌- ప్ర‌గ‌తి భ‌వ‌న్ మ‌ధ్య మైత్రి చిగురిస్తోంది. ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉంచిన బిల్లుల‌ను ఈ నెల 15లోగా క్లియ‌ర్ చేస్తామ‌ని ప్ర‌భుత్వానికి రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు వ‌ర్త‌మానం పంపాయి.

గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద పెండింగ్ బిల్లుల‌పై కేసీఆర్‌తో స‌హా ప‌లువురు మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఒక ద‌శ‌లో గ‌వ‌ర్న‌ర్‌పై సుప్రీంకోర్టుకు కూడా కేసీఆర్ ప్ర‌భుత్వం వెళ్లింది. కానీ ఇప్పుడు మొత్తం సీన్ రివ‌ర్స్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ మూడు బిల్లుల‌కు ఆమోదం తెలిపారు.

వాటిలో 1) ది తెలంగాణ మోటార్‌ వెహికల్‌ ట్యాక్సేషన్‌ (సవరణ) బిల్లు-2022, 2) ది తెలంగాణ మునిసిపాలిటీస్‌ (సవరణ) బిల్లు-2023, 3) ది ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (సవరణ) బిల్లు-2023 ఉన్నాయి.

కానీ పెండింగ్‌లో మ‌రో రెండు బిల్లులు ఉన్నాయి. అవి 1) ది తెలంగాణ స్టేట్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీస్‌ (ఎస్టాబ్లిష్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) (సవరణ) బిల్లు-2022 కాగా, రెండోది 2) ది తెలంగాణ మునిసిపల్‌ లాస్‌ (సవరణ) బిల్లు-2022. ఈ రెండు పెండింగ్ బిల్లుల‌ను మ‌రో 5 రోజుల్లో క్లియ‌ర్ చేయ‌నున్న‌ట్లు రాజ్‌భ‌వ‌న్ నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు క‌బురు అందింది.

Latest News