Governor Tamilisai | RTC బిల్లు.. ఆ 5 అంశాల‌పై వివ‌ర‌ణ కోరిన గ‌వ‌ర్న‌ర్

Governor Tamilisai | టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేసే ప్ర‌క్రియ‌కు సంబంధించిన బిల్లులో ఐదు అంశాల‌పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ వివ‌ర‌ణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివ‌రాలు లేవు. ఉద్యోగుల ప్ర‌యోజ‌నాలు ఎలా కాపాడుతారు? ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా వారికి పెన్ష‌న్ ఇస్తారా? విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆర్టీసీ స్థితిని మార్చ‌డంపై వివ‌రాలు లేవు. ప‌దోన్న‌తులు, క్యాడ‌ర్ నార్మ‌లైజేష‌న్‌లో న్యాయం ఎలా చేస్తారు? అని కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌వ‌ర్న‌ర్ […]

  • Publish Date - August 5, 2023 / 12:21 AM IST

Governor Tamilisai |

టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేసే ప్ర‌క్రియ‌కు సంబంధించిన బిల్లులో ఐదు అంశాల‌పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ వివ‌ర‌ణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివ‌రాలు లేవు. ఉద్యోగుల ప్ర‌యోజ‌నాలు ఎలా కాపాడుతారు? ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా వారికి పెన్ష‌న్ ఇస్తారా? విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆర్టీసీ స్థితిని మార్చ‌డంపై వివ‌రాలు లేవు.

ప‌దోన్న‌తులు, క్యాడ‌ర్ నార్మ‌లైజేష‌న్‌లో న్యాయం ఎలా చేస్తారు? అని కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌వ‌ర్న‌ర్ సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌శ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భ‌ద్ర‌త‌, ప్ర‌యోజ‌నాల‌పై స్ప‌ష్ట‌మైన హామీల‌ను త‌మిళిసై కోరారు.

గ‌వ‌ర్న‌ర్ కోరిన వివ‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చేందుకు తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. గ‌వ‌ర్న‌ర్ లేవనెత్తిన అభ్యంత‌రాల‌పై వివ‌ర‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రికాసేప‌ట్లో రాజ్‌భ‌వ‌న్‌కు వివ‌ర‌ణ పంప‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల స‌మాచారం.

మ‌రో వైపు ఆర్టీసీ యూనియ‌న్ నాయ‌కుల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజ్‌భ‌వ‌న్‌కు ఆహ్వానించారు. పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నాయ‌కుల‌తో చ‌ర్చిస్తాన‌ని ఆమె తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని ఇటీవ‌ల కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలుపాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లును గ‌వ‌ర్న‌ర్‌కు పంప‌గా ఆమె ఆమోదించ‌లేదు. దీంతో రాజ్‌భ‌వ‌న్, ప్ర‌భుత్వం మ‌ధ్య మ‌రోసారి విబేధాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

Latest News