Site icon vidhaatha

GST | జీఎస్టీ వ‌సూళ్ల‌లో స‌రికొత్త రికార్డు.. ఏప్రిల్ నెల‌లో రూ.1.87 ల‌క్ష‌ల కోట్లు వ‌సూళ్లు

GST | జీఎస్టీ వ‌సూళ్ల‌లో స‌రికొత్త రికార్డు న‌మోదైంది. ఏప్రిల్ నెల‌కు గానూ రూ. 1.87 ల‌క్ష‌ల కోట్ల వ‌సూళ్లు జ‌రిగాయి. జీఎస్టీ విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ స్థాయిలో వ‌సూళ్లు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. అయితే గ‌తేడాది ఏప్రిల్ నెల‌లో రూ. 1.68 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే వ‌సూళ్లు అయ్యాయి. ఆ వ‌సూళ్ల‌తో పోలిస్తే ఇప్పుడు 12 శాతం మేర వృద్ధి న‌మోదైంది.

ఏప్రిల్ మాసానికి గానూ రూ. 1,87,035 కోట్లు వ‌సూళ్లు కాగా, ఇందులో సీజీఎస్టీ కింద రూ. 38,440 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ. 47,412 కోట్లు వ‌సూళ్లు అయ్యాయి. ఐజీఎస్టీ కింద రూ. 89,158 కోట్లు, సెస్సు కింద రూ. 12,025 కోట్లు వ‌సూళ్లు అయ్యాయి. ఈ మేర‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ రూ. 18.10 ల‌క్ష‌ల కోట్లు వ‌సూళ్ల‌య్యాయ‌ని, అంత‌కు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 22 శాతం అధిక‌మ‌ని కేంద్రం తెలిపింది.

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల జీఎస్టీ వ‌సూళ్లు కూడా స్వ‌ల్పంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం గ‌తేడాది రూ. 4,995 కోట్లు సాధించ‌గా, ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 5,622 కోట్ల మేర జీఎస్టీ వ‌సూళ్లు న‌మోదు చేసింది. గ‌తేడాదితో పోలిస్తే 13 శాతం మేర వ‌సూళ్లు పెరిగాయి. ఏపీలో రూ. 4,329 కోట్లు వ‌సూళ్లు కాగా, గ‌తేడాది రూ. 4,067 కోట్లు వ‌సూళ్లు అయ్యాయి. అంటే 6 శాతం మేర వ‌సూళ్లు పెరిగాయి.

Exit mobile version