Gujarat | నీరసమేనా.. గుజరాత్‌ మోడల్‌! పోషకాహార లేమితో చిన్నారుల మృతి

Gujarat పోషకాహార లేమితో చిన్నారులు లుబ్దాయి గ్రామంలో ఐదుగురి మృతి పట్టించుకోని జిల్లా అధికారులు అహ్మదాబాద్‌: గుజరాత్‌ వెలగిపోతున్నదంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నది. పార్లమెంటు ఎన్నికల్లో గుజరాత్‌ మోడల్‌ గురించి చెబుతూనే ఓట్లు దండుకున్నది. నరేంద్రమోదీ ప్రధానికి కావడానికి ముందు తరచూ గుజరాత్‌ మోడల్‌ గురించి ఊదరగొట్టేవారు. కానీ.. గుజరాత్‌ వెలిగిపోవడం లేదని, అక్కడి బాలలు పోషకాహారం లేక కునారిల్లిపోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గుజరాత్‌ మోడల్‌ను అధ్యయనం చేసేందుకు అక్కడి గ్రామాలకు వెళ్లిన అనేక […]

  • Publish Date - August 2, 2023 / 11:51 AM IST

Gujarat

  • పోషకాహార లేమితో చిన్నారులు
  • లుబ్దాయి గ్రామంలో ఐదుగురి మృతి
  • పట్టించుకోని జిల్లా అధికారులు

అహ్మదాబాద్‌: గుజరాత్‌ వెలగిపోతున్నదంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నది. పార్లమెంటు ఎన్నికల్లో గుజరాత్‌ మోడల్‌ గురించి చెబుతూనే ఓట్లు దండుకున్నది. నరేంద్రమోదీ ప్రధానికి కావడానికి ముందు తరచూ గుజరాత్‌ మోడల్‌ గురించి ఊదరగొట్టేవారు. కానీ.. గుజరాత్‌ వెలిగిపోవడం లేదని, అక్కడి బాలలు పోషకాహారం లేక కునారిల్లిపోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గుజరాత్‌ మోడల్‌ను అధ్యయనం చేసేందుకు అక్కడి గ్రామాలకు వెళ్లిన అనేక మంది జర్నలిస్టులు వాస్తవ పరిస్థితులను ప్రపంచానికి చూపారు. ఇదే క్రమంలో షోయబ్ డానియల్ అనే ప్రముఖ జర్నలిస్టు పోషకాహార లోపంతో గుజరాత్‌లో చోటు చేసుకున్న చిన్నారుల మరణాలపై వివరాలను బయటకు తీశారు.

లుబ్దాయి అనే గ్రామంలో జూన్ 7నుండి జూన్ 15 మధ్య ఐదుగురు చిన్నారులు పోషకాహార లోపంతో మరణించారు. చనిపోయిన వారిలో 15 నెలల వయస్సు గల వారు కూడా ఉన్నారని ఆ గ్రామ పెద్ద చెప్పారు. ఈ విషయాన్ని తాలూకా, జిల్లా అధికారులకు కూడా తెలియజేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతటి ముఖ్యమైన విషయాల్లో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో స్వచ్ఛంద సంస్థల సహాయంతో గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామంలో ఇంకా 39 మంది చిన్నారులు పోషకాహార లోపం ఎదుర్కొంటున్నారని వైద్యులు గుర్తించారు.

ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. ఐదుగురు చనిపోతే.. ఇద్దరే చనిపోయారని ప్రభుత్వం పేర్కొంటున్నదని గ్రామ పెద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌ గొప్పగా అభివృద్ధి సాధిస్తున్నదని ఢంకా బజాయిస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం.. శిశు మరణాలపై మాత్రం నోరెత్తడం లేదు.

భారత్ గొప్పగా అభివృద్ధి సాధిస్తున్నదని మోదీ ప్రకటించుకుంటున్నా.. దేశంలో అనేక ప్రాంతాల్లో చిన్నారులు పోషకాహార లేమిని ఎదుర్కొంటున్నారు. నిజమైన అభివృద్ధి అంటే.. పోషకాహార లోపాలు లేకుండా, శిశు మరణాల రేటు తక్కువగా ఉండటమే.

2022 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పరిశీలిస్తే.. 121 దేశాల జాబితా తయారు చేస్తే.. అతి తక్కువ ఆహార వినియోగంతో భారత్ 107వ స్థానంలో ఉన్నది. మన కన్నా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ర్యాంకులు మెరుగ్గా ఉండటం గమనార్హం. ఆఖరుకు ఈ విషయంలో మనకన్నా పేద దేశంగా భావించే పాకిస్థాన్‌ కూడా మంచి స్థితిలోనే ఉన్నది.

Latest News