Guntur | కౌన్సిల్ మీటింగులో ఐ-ప్యాక్ సభ్యులు!! TDP సభ్యుల అభ్యంతరం!! గుంటూరులో రసాభాస

Guntur విధాత‌: ఇందుగలడందు సందేహం వలదు.. ఎందెందు చూసినా శ్రీహరే ఉంటాడు అని ప్రహ్లాదుడు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ లో అన్ని విభాగాల్లో కీ జగన్ కు రాజకీయ వ్యూహాలు నేర్పుతున్న ఐ - ప్యాక్ సభ్యులు దూరిపోతున్నారు. ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఏదైనా సభలు.. సమావేశాలు జరిగితే సంఘ విద్రోహ శక్తులు ఏమైనా చేయొచ్చా.. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా అనేవి గమనించి ప్రభుత్వానికి నివేదిస్తారు. కానీ ఇప్పుడు ఐ ప్యాక్ సభ్యులు ప్రభుత్వ […]

  • Publish Date - June 23, 2023 / 03:56 PM IST

Guntur

విధాత‌: ఇందుగలడందు సందేహం వలదు.. ఎందెందు చూసినా శ్రీహరే ఉంటాడు అని ప్రహ్లాదుడు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ లో అన్ని విభాగాల్లో కీ జగన్ కు రాజకీయ వ్యూహాలు నేర్పుతున్న ఐ – ప్యాక్ సభ్యులు దూరిపోతున్నారు. ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఏదైనా సభలు.. సమావేశాలు జరిగితే సంఘ విద్రోహ శక్తులు ఏమైనా చేయొచ్చా.. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా అనేవి గమనించి ప్రభుత్వానికి నివేదిస్తారు.

కానీ ఇప్పుడు ఐ ప్యాక్ సభ్యులు ప్రభుత్వ సమావేశాల్లోకి చొరబడడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. గుంటూరు కార్పొరేషన్ సమావేశంలో తాగునీటి సమస్య మీద టిడిపి, వైసిపి సభ్యుల మధ్య హాట్ హాట్ వాగ్యుద్ధం నడిచింది. ప్రభుత్వ వైఫల్యాల మీద టిడిపి సభ్యులు గట్టిగా నిలదీస్తున్నారు.. దీనికి వైసిపి సభ్యులు సైతం అదే రీతిలో సమాధానం ఇస్తున్నారు.

టీడీపీ ఫ్లోర్ వీడర్ కోవెలమూడి రవీంద్ర పైకి వైసీపీ కార్పోరేటర్లు దూసుకెళ్లారు. ఆ హఠాత్పరినామాన్ని ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తఫా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అడ్డుకున్నారు. వ్యక్తిగతమైన దూషణలు చేసిన టీడీపీ కార్పోరేటర్లు క్షమాపణ చెప్పాలని వైసీపీ కార్పోరేటర్లు డిమాండ్ చేశారు.

ఈ గొడవ వుండగానే కార్పొరేషన్ సమావేశం లో ఐ ప్యాక్ టీం కనిపించడం కలకలం రేపింది. మొత్తానికి టిడిపి సభ్యుల డిమాండ్ మేరకు ఐ – ప్యాక్ సభ్యులను అక్కడి నుంచి వెనక్కి పంపారు. కౌన్సిల్ కు ఎన్నికైన సభ్యులు, మీడియా ప్రతినిధులు , అధికారులు మినహా ప్రైవేట్ వ్యక్తులు కార్పొరేషన్ సమావేశాలకు రావడం అసాధ్యం.

కానీ ఇలా ఐ ప్యాక్ సభ్యులు వచ్చి కూర్చోవడం ఇక్కడ కలకలానికి దారితీసింది. అయితే ఎక్కడ ఏ సమావేశం జరుగుతున్నా అక్కడ ఐ ప్యాక్ సభ్యులు ప్రత్యక్షమై అక్కడి మూడ్, ప్రభుత్వం పట్ల ఉన్న అభిప్రాయాన్ని పైకి చేరుస్తున్నట్లు ఈ సంఘటనతో స్పష్టమైంది.