Site icon vidhaatha

Hairs | బాలిక క‌డుపులో రెండున్న‌ర కిలోల వెంట్రుక‌లు..

Hairs | ఓ 14 ఏండ్ల బాలిక తీవ్ర‌మైన క‌డుపు నొప్పి( Stomach Pain ) తో బాధ‌ప‌డుతోంది. నిత్యం వాంతులు( Vomtings ) చేసుకుంటుంది. ఆహారం కూడా స‌రిగా తిన‌డం లేదు. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన త‌ల్లిదండ్రులు.. ఆ అమ్మాయిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. బాలిక‌( Girl )ను ప‌రీక్షించిన వైద్యులు( Doctors ) షాక్ అయ్యారు. ఆమె క‌డుపులో వెంట్రుక‌లు( Hairs ) పేరుకుపోయిన‌ట్లు నిర్ధారించారు. ఆ త‌ర్వాత రెండు గంట‌ల పాటు స‌ర్జ‌రీ నిర్వ‌హించి, క‌డుపులో ఉన్న వెంట్రుక‌ల‌ను తొల‌గించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌( Uttar Pradesh )లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన 14 ఏండ్ల బాలిక గ‌త కొంత‌కాలంగా క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతోంది. వాంతులు సైతం చేసుకుంటుంది. ఆహారం కూడా తిన‌డం లేదు. ఆ అమ్మాయి ఆరోగ్య ప‌రిస్థితి రోజురోజుకు కీణిస్తుండ‌టంతో.. ఆందోళ‌న‌కు గురైన పేరెంట్స్.. స్థానికంగా ఉన్న ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలికి వైద్యులు సీటీ స్కాన్ చేయ‌గా, క‌డుపులో వెంట్రుక‌ల ముద్దలు ఉన్న‌ట్లు తేలింది.

దీంతో పీడియాట్రిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ప్ర‌కాశ్ ఆధ్వ‌ర్యంలో బాలిక‌కు స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. రెండు గంట‌ల పాటు శ‌స్త్ర‌చికిత్స చేసి వెంట్రుక‌లను తొల‌గించారు. ఆ వెంట్రుక‌ల బ‌రువు రెండున్న‌ర కిలోలు ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. బాలిక‌కు స‌రైన స‌మ‌యంలో స‌ర్జ‌రీ జ‌రిగిందని, ఆల‌స్య‌మైతే క‌డుపులో రంధ్రం ప‌డే ప్ర‌మాదం ఉండేద‌ని వైద్యులు పేర్కొన్నారు. ఇలా ప‌దే ప‌దే వెంట్రుక‌లు తినే అలవాటును ట్రైకోఫాగియా అంటార‌ని తెలిపారు.

Exit mobile version