Site icon vidhaatha

Tirumala | కాలినడకన.. శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని, శ్రీనిధి శెట్టి (Video)

విధాత: టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకుున్నారు. ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నాని, శ్రీనిధికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ

నివారం రాత్రి వారు తిరుమలకు మెట్ల మార్గం గుండా కాలినడకన చేరుకున్నారు. భక్తులు గుర్తు పట్టకుండా వారు ముఖాలకు మాస్క్ లు కట్టుకుని కాలినడకన సామాన్య భక్తుల మాదిరిగా కొండపైకి చేరుకున్నారు. మార్గమధ్యలో కొందరు భక్తులు వారిని గుర్తు పట్టి సెల్ఫీల కోసం ప్రయత్నించడం నాని, శ్రీనిధి శెట్టిలను ఇబ్బందికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్-3 షూటింట్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి హిట్ సిరీస్‌ డైరెక్టర్‌ శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని అర్జున్‌ సర్కార్‌ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఈ సినిమా మేడే సందర్భంగా 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Exit mobile version