Site icon vidhaatha

Nani | దుల్హర్‌.. ఒక్కడే పాన్‌ ఇండియా స్టార్‌: నాని! లేని పోని చిక్కులో పడ్డ న్యాచురల్‌ స్టార్‌

Nani |

నేచుర‌ల్ స్టార్ నాని పెద్ద‌గా వివాదాల జోలికి వెళ్ల‌డు. ఆయ‌న సినిమాలేవో ఆయ‌న చేసుకుంటూ ముందుకు వెళుతుంటాడు. నాని సినిమాలు కూడా ఎలాంటి వివాదాలు ఉండ‌వు. అయితే నాని కొన్నిసార్లు అంద‌రి మంచి కోరి చేసిన కామెంట్స్ వివాదాస్ప‌దం అవుతుంటాయి. అప్ప‌ట్లో ఓటీటీకి వ్యతిరేఖంగా గ‌ళం విప్పిన నాని, ఆ త‌ర్వాత ఏపీలో టిక్కెట్ ధ‌ర‌ల‌పై కూడా మండిప‌డ్డారు.

ఆ స‌మ‌యంలో నానిని కొంద‌రు తిట్టిపోసారు. ఇక తాజాగా దుల్హర్‌ స‌ల్మాన్‌పై పొగ‌డ్తలు కురిపించి లేని పోని చిక్కుల్లో ప‌డ్డారు. వివరాల‌లోకి వెళితే నాని రీసెంట్‌గా దుల్హర్‌ స‌ల్మాన్ న‌టించిన‌ కింగ్ ఆఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజ‌ర‌య్యాడు. ఈ చిత్రం ఆగష్టు 24న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతున్న నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

కింగ్ ఆఫ్ కోత ప్రీ రిలీజ్ వేడుకకి నాని, రానా అతిథులుగా హాజరు కాగా, నాని ఆయ‌న‌ని పాన్ ఇండియా స్టార్ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మ‌రాయి. ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. నాకు తెలిసిన వ‌ర‌కు ఇప్పుడున్న న‌టులలో పాన్ ఇండియా నటుడు ఎవరైనా ఉన్నారంటే అది దుల్హర్ సల్మాన్ మాత్రమే అని అన్నారు.

నాకు పాన్ ఇండియా అనే ప‌దం న‌చ్చ‌దు. కాని దుల్క‌ర్ మాత్రం పాన్ ఇండియా స్టార్‌కి అర్హుడు. ఆయ‌న కోసం ఒక హిందీ దర్శకుడు దుల్హర్ కోసం కథ రాస్తాడు.. అలాగే తమిళ దర్శకుడు రాస్తాడు.. తెలుగు, మలయాళీ దర్శకులు కూడా కథలు రాస్తారు. ఒక పాన్ ఇండియా హీరోకి కావాల్సింది ఇదేన‌ని ఆయ‌న‌పై పొగ‌డ్తలు కురిపించారు.

నాని కాస్త అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రోలింగ్‌కి కార‌ణం అవుతుంది. నాకు తెలిసిన పాన్ ఇండియా హీరో దుల్హర్ మాత్రమే అని నాని అన‌డంతో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చ‌ర‌ణ్ , అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్ కాదా, వారు నానికి తెలియ‌దా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్స్.

అంద‌రి క‌న్నా ముందు ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అలాంటిది ప్ర‌భాస్ పేరు కూడా ఎత్త‌క‌ పోవ‌డం ఏంట‌ని మండి ప‌డుతున్నారు. నాని ఆ స్థాయికి చేరుకోలేడు కాబ‌ట్టే తాను పాన్ ఇండియా స్టార్ ప‌దాన్ని ఇష్ట‌ప‌డ‌డం లేదంటూ కొంద‌రు నెటిజ‌న్స్ చెప్పుకొస్తున్నారు.

Exit mobile version