విధాత Husband shocked by wife: రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే చనిపోతానని తన భార్య వేధిస్తుందని పోలీసులకు ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి చేసిన ఫిర్యాదు వైరల్ గా మారింది. బెంగళూరు – వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగికి ఓ యువతితో 2022లో వివాహం జరిగింది. శ్రీకాంత్‌కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో ఇంటి నుండే పని చేస్తున్నాడు. అయితే ఆ యువతి కాపురం చేయాలంటే రోజు రూ.5000 ఇవ్వాలని, లేదంటే రూ.45 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకోవాలని నిత్యం వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం ఉద్యోగం కూడా చేయకుండా ఇబ్బందులు పెడుతోందని బెంగళూరు పరిధిలోని వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ లో కన్నీరుపెట్టుకున్నారు.
జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్స్‌లు చేస్తూ అకారణంగా తిడుతుందని.. ఏమైనా అంటే చనిపోతానని బెదిరిస్తుందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కనీసం విడాకులు ఇవ్వమన్నా రూ.45 లక్షలు డిమాండు చేస్తోందని ఆరోపించాడు. అయితే దీనిపై అతడి భార్య కథనం మరోలా ఉంది.. మరో పెళ్లి చేసుకునేందుకే శ్రీకాంత్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఆడియోలు, వీడియోలను ఎడిట్ చేసి తనపై నిందలు వేస్తున్నాడని ఆరోపించింది. అయితే ఇటీవల బెంగుళూరులో భార్యా బాధితులైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్టాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీకాంత్ దంపతుల ఫిర్యాదులో ఎవరి వాదన ఎంత నిజమో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు .