- ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిని దారుణంగా చంపిన కుటుంబసభ్యులు
Honor killing | విధాత: హైదరాబాద్‌లో మరో పరువు హత్య కలకలం సృష్టించింది. మతాంతర వివాహం చేసుకున్న హరీశ్ అనే యువకుడు బుధవారం రాత్రి దూలపల్లి రహదారిపై దారుణ హత్యకు గురయ్యాడు. హరీశ్‌ను యువతి కుటుంబసభ్యులు కత్తులతో పొడిచి చంపారు.
ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, ప్రేమించిన యువతి కుటుంబసభ్యులే హత్య చేశారని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. అమ్మాయి కళ్లెదుటే హరీశ్‌ను హత్య చేశారు. మృతుడు సూరారం కాలనీకి చెందిన దేవరకొండ హరీశ్‌గా పోలీసులు గుర్తించారు.
ప్రేమ విషయం తెలిసి యువతి కుటుంబసభ్యులు ఆయనను హెచ్చరించారు. పది రోజుల కిందట హరీశ్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిని సహించలేక యువతి కుటుంబ సభ్యులు ఆయనను ఘోరంగా హత్య చేశారు. అనంతరం యువతిని తమ వెంట తీసుకెళ్లారు.