Site icon vidhaatha

Hydra: నోటీసులిచ్చి లావాదేవీలు.. హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Hydra:

విధాత : హైడ్రాపై జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. హైడ్రా ఆక్రమణలు, కూల్చివేతలపై నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. ఎమ్మెల్యేగా నేను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడని.. ఆయన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదని అనిరుధ్ రెడ్డి విమర్శించారు.

ఎమ్మెల్యే ఫోన్ కే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా అని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్లు నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ విమర్శలు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైడ్రాపై మ‌రోసారి ఆయన పలు ఆరోపణలు, విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.

Exit mobile version