KA PAUL | నేను లోకల్.. విశాఖ నాదే! నేనే పోటీ చేస్తా: పాల్

KA PAUL | ఎవరెవరో వచ్చారు.. గెలిచారు.. నాకేం తక్కువ.. నేను లోకల్.. నేను గెలుస్తాను.. పోటీ చేస్తాను అంటున్నారు కెఏ పాల్. అవును సుబ్బరామిరెడ్డి.. జనార్దన్ రెడ్డి.. పురంధేశ్వరి.. గీతం మూర్తి.. వీళ్లంతా నాన్ లోకల్ వాళ్ళు. వీళ్ళు విశాఖ నుంచి ఎంపీలుగా గెలవగా లేనిది.. స్థానిక వ్యక్తిని.. నేను ఎందుకు తగ్గాలి.. నేను పోటీ చేస్తాను.. గెలుస్తాను.. అంటున్నారు ప్రజా శాంతి అధ్యక్షుడు కెఏ పాల్. తాను ఇక మీదట విశాఖలోనే మకాం పెడతానని, […]

  • Publish Date - August 4, 2023 / 03:48 PM IST

KA PAUL |

ఎవరెవరో వచ్చారు.. గెలిచారు.. నాకేం తక్కువ.. నేను లోకల్.. నేను గెలుస్తాను.. పోటీ చేస్తాను అంటున్నారు కెఏ పాల్. అవును సుబ్బరామిరెడ్డి.. జనార్దన్ రెడ్డి.. పురంధేశ్వరి.. గీతం మూర్తి.. వీళ్లంతా నాన్ లోకల్ వాళ్ళు. వీళ్ళు విశాఖ నుంచి ఎంపీలుగా గెలవగా లేనిది.. స్థానిక వ్యక్తిని.. నేను ఎందుకు తగ్గాలి.. నేను పోటీ చేస్తాను.. గెలుస్తాను.. అంటున్నారు ప్రజా శాంతి అధ్యక్షుడు కెఏ పాల్.

తాను ఇక మీదట విశాఖలోనే మకాం పెడతానని, విశాఖలోనే ఉంటూ తన రాజకీయం ఏంటో చూపిస్తాను అని తేల్చారు. అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయని పాల్ ఆరోపించారు. విశాఖకు మేలు చేసే పార్టీ ఏదీ లేదని, అందుకే తానే గెలిచి, తన సత్తా చూపిస్తాను అంటున్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన కిడారి ఆనంద్ పాల్ విశాఖకు దగ్గర్లోని తగరపు వలసకు చెందిన వారు. తనకు విశాఖ గురించి, సమస్యల గురించి పూర్తిగా తెలుసని, తనకన్నా మెరుగైన అభ్యర్థి ఎవరున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అందుకే తాను పోటీ చేస్తానని, గెలిచి తీరుతానని అంటున్నారు.

Latest News