Site icon vidhaatha

Viral Video | ఎముక‌ల‌ను న‌మిలి మింగిన జిరాఫీలు..

Viral Video | మొన్నేమో ఓ జింక పామును న‌మిలి మింగింది. నిన్నేమో ఓ రెండు జిరాఫీల‌ను ఎముక‌ల‌ను న‌మిలి మింగాయి. జింక‌, జిరాఫీ రెండు జంతువులు కూడా శాఖాహారులే. వీటి ప్ర‌ధాన ఆహారం.. చెట్ల ఆకులు, గ‌డ్డి మొక్క‌లే. కానీ మాంసాన్ని భ‌క్షించాయి.

దీంతో అటు పామును న‌మిలి మింగిన జింక‌, ఎముక‌లను న‌మిలి మింగిన జిరాఫీలు సోష‌ల్ మీడియా దృష్టిని ఆక‌ర్షించాయి. ప్ర‌స్తుతం ఈ రెండింటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

జిరాఫీలు ఎముక‌ల‌ను న‌మిలి మింగిన వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత నంద త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. జిరాఫీలు శాఖాహారులే. తమ పొడ‌వైన మెడ‌తో ఆకులను, చెట్ల కొమ్మల‌ను తింటాయి. ఆ విధంగా అవి ఆహారాన్ని తీసుకుంటాయి.

కానీ కొన్ని సంద‌ర్భాల్లో త‌మ శ‌రీరంలో ఫాస్ప‌ర‌స్ త‌క్కువైన‌ప్పుడు.. ఈ విధంగా ఎముక‌ల‌ను తింటాయి. నేచ‌ర్ ఈజ్ అమేజింగ్ అంటూ సుశాంత నంద రాసుకొచ్చారు.

Exit mobile version