– పాకిస్థాన్ సైన్యం సిద్ధంగా ఉండాలి
– ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మరోసారి పాకిస్థాన్ మీద దాడి చేయొచ్చని .. ఇందుకు పాకిస్థాన్ సైన్యం సిద్ధంగా ఉండాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం జైళ్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
అక్కడి కోర్టులు, ప్రభుత్వం కేవలం బలహీనుల మీదే ప్రతాపం చూపుతున్నాయని ఆరోపించారు. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దేశానికి ప్రధానికి ఉన్నారని విమర్శించారు. ఆసిమ్ మునీర్‌కి ఇటీవల పాక్ ప్రభుత్వం ‘‘ఫీల్డ్ మార్షల్’’ పదవితో సత్కరించింది.
దీనిపై కూడా ఇమ్రాన్ ఖాన్ సెటైర్లు వేశారు. అసిమ్ మునీర్ తనను తాను రాజుగా ప్రకటించుకోవాల్సిందంటూ వ్యాఖ్యానించారు. తనకు, సైన్యానికి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని, ఇది నిరాధారమైన ఆరోపణలుగా ఇమ్రాన్ ఖాన్ కొట్టిపారేశారు. పాకిస్తాన్ భవిష్యత్తుపై నిజంగా శ్రద్ధ ఉంటే తాను ఆర్మీలో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.