Leopard | వెంబ‌డించిన వీధి కుక్క‌లు.. 18 గంట‌లు కొబ్బ‌రి చెట్టుపైనే చిరుత పులి

Leopard | చిరుత పులి.. ఈ పేరు విన‌గానే గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. అటు జంతువులు, ఇటు మ‌న‌షులు అల్లాంత దూరాన పారిపోతారు. కానీ ఓ చిరుత‌కు మాత్రం వీధి కుక్క‌లు ముచ్చెట‌మ‌లు ప‌ట్టించాయి. ఆ చిరుత‌ను వీధి కుక్క‌లు వెంబ‌డించ‌డంతో.. అది కొబ్బ‌రి చెట్టు ఎక్కి కూర్చుంది. ఈ ఘ‌ట‌న నార్త్ గోవాలోని పొండా తాలుకాలో వెలుగు చూసింది. కులాన్‌లోని స‌వోయి వేరేం ఏరియాలోకి ఆదివారం ఉద‌యం ఓ చిరుత ప్ర‌వేశించింది. దీంతో స్థానికులు తీవ్ర […]

  • Publish Date - May 17, 2023 / 03:43 AM IST

Leopard |

చిరుత పులి.. ఈ పేరు విన‌గానే గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. అటు జంతువులు, ఇటు మ‌న‌షులు అల్లాంత దూరాన పారిపోతారు. కానీ ఓ చిరుత‌కు మాత్రం వీధి కుక్క‌లు ముచ్చెట‌మ‌లు ప‌ట్టించాయి. ఆ చిరుత‌ను వీధి కుక్క‌లు వెంబ‌డించ‌డంతో.. అది కొబ్బ‌రి చెట్టు ఎక్కి కూర్చుంది. ఈ ఘ‌ట‌న నార్త్ గోవాలోని పొండా తాలుకాలో వెలుగు చూసింది.

కులాన్‌లోని స‌వోయి వేరేం ఏరియాలోకి ఆదివారం ఉద‌యం ఓ చిరుత ప్ర‌వేశించింది. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వీధి కుక్క‌లు కూడా చిరుత‌ను వెంబ‌డించాయి. ఇక చేసేదేమీ లేక చిరుత పులి కొబ్బ‌రి చెట్టు ఎక్కి న‌క్కింది.

స‌మాచారం అందుకున్న అట‌వీశాఖ అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. చిరుత‌కు మ‌త్తు మందు ఇవ్వాల‌నుకున్నారు. కానీ 25 మీటర్ల ఎత్తులో చిరుత ఉండ‌టంతో.. మ‌త్తు మందు ఇవ్వ‌లేదు. ఎందుకంటే అంత ఎత్తు నుంచి కింద ప‌డితే చిరుత‌కు ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని అధికారులు భావించారు.

ఇక ఆదివారం రాత్రి వ‌ర‌కు అక్క‌డే ఉన్న అధికారులు.. జ‌నాల‌ను ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌లేదు. వీధి కుక్క‌ల‌ను కూడా ఆ ప‌రిస‌ర ప్రాంతాల నుంచి దూరంగా త‌రిమేశారు. వీధి దీపాల‌ను ఆర్పేశారు. అనంత‌రం చిరుత‌ను మెల్లిగా కింద‌కు దించే ప్ర‌య‌త్నం చేశారు. సోమ‌వారం తెల్ల‌వారుజామున 1:15 గంట‌ల‌కు చిరుత‌ను అడ‌విలోకి పంపించేశారు. 18 గంట‌ల పాటు చిరుత కొబ్బ‌రి చెట్టుపైనే ఉండిపోయింది.

Latest News