Ind vs Nepal | ప‌సికూన‌పై అద్భుత విజయం.. పాకిస్తాన్‌తో మ‌ళ్లీ త‌ల‌ప‌డ‌నున్న భార‌త్

Ind vs Nepal | ఆసియా క‌ప్ 2023 టోర్నీలో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్‌లు ఆడ‌గా, తొలి మ్యాచ్ ఫ‌లితం తేల‌కుండానే ర‌ద్దైంది. రెండో మ్యాచ్‌లోను వ‌ర్షం దోబూచులాడిన కూడా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భార‌త్ 10వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. టీమిండియాకి 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని అంపైర్స్ నిర్ణ‌యించ‌గా, ఆ ల‌క్ష్యాన్ని సునాయాసంగా సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి […]

  • Publish Date - September 5, 2023 / 01:30 AM IST

Ind vs Nepal |

ఆసియా క‌ప్ 2023 టోర్నీలో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్‌లు ఆడ‌గా, తొలి మ్యాచ్ ఫ‌లితం తేల‌కుండానే ర‌ద్దైంది. రెండో మ్యాచ్‌లోను వ‌ర్షం దోబూచులాడిన కూడా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భార‌త్ 10వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. టీమిండియాకి 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని అంపైర్స్ నిర్ణ‌యించ‌గా, ఆ ల‌క్ష్యాన్ని సునాయాసంగా సాధించారు.

కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యంతో మ్యాచ్‌ని 20 ఓవర్లలోనే ముగించ‌డం విశేషం. అయితే రోహ‌త్ శ‌ర్మ ఈ మ్యాచ్‌లో 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేయగా, ఇది ఆయ‌న‌కి ఆసియా క‌ప్ ప‌దో హాఫ్ సెంచ‌రీ కాగా, రోహిత్ క‌న్నా ముందు కుమార సంగర్కర, ఆసియా కప్‌లో 12 సార్లు 50+ స్కోర్లు చేసి టాప్‌లో ఉన్నాడు.

తొలుత టాస్ గెలిచిన రోహిత్.. నేపాల్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. వారు 230 ప‌రుగుల‌కి ఆలౌట్ అయ్యారు. 231 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా 2.1 ఓవర్లలో 17 పరుగులు చేయ‌గా, ఆ స‌మ‌యంలో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో ఆట‌ని దాదాపు రెండు గంట‌ల‌పాటు నిలిపివేశారు.

ఎక్కువ స‌మ‌యం వేస్ట్ కావ‌డంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్ణయించారు . ఈ ల‌క్ష్యాన్ని ఓపెన‌ర్స్ సులువుగా చేధించారు. మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 62 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో భార‌త్ ఆటగాళ్లు మొదటి 5 ఓవర్లలో మూడు క్యాచులను డ్రాప్ చేశారు. దీన్ని స‌ద్వినియోగం చేసుకున్న‌ నేపాల్ ఓపెనర్లు 9.5 ఓవర్లలో తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించారు. నేపాల్ బ్యాట్స్‌మెన్స్ లో ఓపెనర్ ఆసిఫ్ షేక్ 97 బంతుల్లో 8 ఫోర్లతో 58 పరుగులు చేసి ఔట్ కాగా, దీపేంద్ర సింగ్, 56 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు.

వీరిద్ద‌రు విలువైన ప‌రుగులు చేయ‌డంతో నేపాల్ స్కోర్ 230కి చేరింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ అందుకున్నారు. ఈ గెలుపుతో సూపర్-4‌కు క్వాలిఫై అయిన భారత్.. మరోసారి దాయాదీ పాకిస్థాన్‌తో తలపడబోతుంది.. గత శనివారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం విదిత‌మే.

Latest News