Site icon vidhaatha

Indrayani River Bridge Collapses: కూలిన ఇంద్రాయణి నది వంతెన..ఆరుగురు మృతి..25 మంది గల్లంతు

న్యూఢిల్లీ : మహారాష్ట్ర పూణెలో ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన వంతెన కూలిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 25మంది గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పుణె జిల్లాలోని మావళ్ తాలూకాలోని తలెగావ్ దాభాడే సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కుండమళా వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఇంద్రాయణి నదిపై ఉన్న పాత బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 20 నుంచి 25మంది బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో గల్లంతయ్యినట్లు తెలుస్తోంది.

పర్యాటక ప్రాంతం కావడంతో నది వరదలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారిలో కొంత మంది సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పురాతన వంతెన మీదకు వెళ్లారు. అప్పటికే రెండు రోజులు పాటు భారీగా కురిసిన వర్షాలకు పురాతన వంతెన నాని ఉండటంతో పర్యాటకుల బరువు..కదలికలతో వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. వంతెనపై ఉన్న పర్యాటకులంతా ఇంద్రాయణి నదిలో పడిపోయారు.

ప్రస్తుతం ఆరుగురు చనిపోయినట్లుగా..మరో 25మంది గల్లంతైనట్లుగా అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. తలెగావ్ దాభాడే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. ఐదుగురు పర్యాటకుల్ని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి.

 

Exit mobile version