ORR కోసం.. 7,380 కోట్లు సర్కారకు చెల్లించిన IRB ఇన్‌ఫ్రా!

ORR విధాత‌: హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్‌రోడ్డును హెచ్ఎండీఏ (HMDA) ముంబైకి చెందిన ఐఆర్‌బీ ఇన్ఫ్రా కంపెనీకి క‌ట్ట‌బెట్టింది. ఇందుకోసం ఆ సంస్థ శుక్ర‌వారం రూ.7380 కోట్లు ప్ర‌భుత్వానికి చెల్లించిందని స‌మాచారం. నగరానికి మణిహారంలా నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఓఆర్‌ఆర్‌పై టోల్ ఆప‌రేట్ ట్రాన్స‌ఫ‌ర్‌ (TOT) కోసం 30 సంవ‌త్స‌రాలు ఈ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఈ రోడ్డు విలువ సుమారు రూ.30 వేల కోట్లు ఉంటుంది. సంవ‌త్స‌రానికి దాదాపు 540 కోట్లు ఆదాయం […]

  • Publish Date - August 11, 2023 / 02:01 PM IST

ORR

విధాత‌: హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్‌రోడ్డును హెచ్ఎండీఏ (HMDA) ముంబైకి చెందిన ఐఆర్‌బీ ఇన్ఫ్రా కంపెనీకి క‌ట్ట‌బెట్టింది. ఇందుకోసం ఆ సంస్థ శుక్ర‌వారం రూ.7380 కోట్లు ప్ర‌భుత్వానికి చెల్లించిందని స‌మాచారం.

నగరానికి మణిహారంలా నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఓఆర్‌ఆర్‌పై టోల్ ఆప‌రేట్ ట్రాన్స‌ఫ‌ర్‌ (TOT) కోసం 30 సంవ‌త్స‌రాలు ఈ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఈ రోడ్డు విలువ సుమారు రూ.30 వేల కోట్లు ఉంటుంది. సంవ‌త్స‌రానికి దాదాపు 540 కోట్లు ఆదాయం వ‌స్తుండ‌గా కేవ‌లం 248 కోట్ల‌కే అప్ప‌జెప్ప‌డంతో ప్ర‌భుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఔట‌ర్ కోసం 11 కంపెనీలు పోటీ ప‌డ‌గా చివ‌ర‌కు ఐఆర్‌బీ ఇన్ఫ్రా కంపెనీ ద‌క్కించుకున్నది. 7,380 కోట్లు ఒకే సారి చెల్లించ‌డంతో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోప‌న‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో దాదాపు వేయి కోట్ల‌కు పైగా చేతులు మారాయ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే NHAI లెక్క‌ల ప్ర‌కార‌మే లీజుకు ఇచ్చిన‌ట్లు HMDA వెల్ల‌డించింది. కాగా ఈ విష‌యంపై టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి గ‌తంలో HMDA అధికారుల‌పై తీవ్ర ఆరోప‌న‌లు చేశారు. ఈ నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ కోశాన‌ ఆమోదించ‌ద‌న్నారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోకి రాగానే వెంట‌నే దీనిపై విచారణ‌కు ఆదేశిస్తామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ అధికారులైన‌ సోమేశ్ కుమార్, జ‌య‌శ్ రంజ‌న్, అర‌వింద్ కుమార్‌ల నిర్ణ‌యాల‌ను కాంగ్రెస్ స‌మీక్షిస్తుంద‌ న్నారు. అలాగే య‌జ‌మాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వ‌స్తుందని హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలో HMDA రేవంత్‌కు నోటీసులు కూడా జారీ చేసిన విష‌యం విదిత‌మే.

Latest News