Site icon vidhaatha

Koilakonda | కోయిలకొండకు సాగునీరు: ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

Koilakonda |

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : కరివెనా ప్రాజెక్టు ద్వారా కోయిలకొండ మండలంలోని గ్రామాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నదని నారాయణ పేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి తెలిపారు.

ఆదివారం ఆయన కోయిలకొండ రైతులతో కలిసి భూత్పూర్ మండలంలోని కరివెనా ప్రాజెక్టును
పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడే రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు నుంచి మణికొండ, పెరికివీడు, కేస్వాపూర్, మల్కాపూర్ మీదుగా కోయిలకొండ వరకు నీరు వస్తుందని అన్నారు.

అక్కడి నుంచి ధన్వాడ మండలం మీదుగా నారాయణ పేట వరకు సాగునీరు వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత పాలమూరు రంగారెడ్డి పథకంలో నారాయణ పేట నియోజకవర్గంలోని సుమారు అన్ని మండలాలకు సాగునీరు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Exit mobile version