Site icon vidhaatha

జనసేనకు జబర్దస్త్ నటుల ప్రచారం

విధాత: జబర్దస్త్ నటులు రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండటం ఆసక్తి రేపుతుంది. అనకాపల్లి రూరల్ మండలం బీఆర్టీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని వారు అభ్యర్థించారు.

టీవీల్లో జబర్దస్త్ షో ద్వారా నవ్వించే నటులు తమ వద్దకు వచ్చి ఎన్నికల ప్రచారం సాగిస్తుండటంతో జనం వారిని చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల్లో వారి ప్రచారం ఎంత మేరకు కొణతాల విజయానికి దోహదం చేస్తుందన్నదానిపై ఫలితాల దాకా వేచిచూడాల్సిందే.

Exit mobile version