ys Jagan, Ambani
- భారీ సోలార్ పవర్ స్టేషన్ ఏర్పాటుకు అంబానీ హామీ
విధాత: విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సమ్మిట్ (Sammit) మొదటిరోజు ముగిసింది… పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చారు.. మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించింది ప్రభుత్వం. అంబానీ (Ambani), అదానీ (adani), బిర్లా (birla) తదితరులు వచ్చారు… సదస్సులో మాట్లాడారు.. అయితే ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన మొత్తం మీటింగ్ వాతావరణాన్ని మార్చేసింది.
సదస్సుకు వచ్చిన ముఖేష్ అంబానీకి మంత్రులు గుడివాడ అమర్ నాథ్ (Gudiwada Amarnath), విడదల రజిని (Vidadala Rajini) స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్(CM Jagan) ముఖేష్ (Mukesh Ambani) అంబానీకి అభివాదం చేశారు.. ఆతరువాత ఆయన సీట్లో ఆసీనులవుతారనుకున్న తరుణంలో ఇద్దరూ క్షణంలో చేతులు కలిపి అనంతరం ఆలింగనం చేసుకోవడం మొత్తం సభా వాతావరణాన్ని మార్చేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖేష్ అంబానీకి జగన్‌కు బాగానే సఖ్యత కుదిరింది.
జగన్ అధికారంలోకి వచ్చాక ముకేష్ అంబానీ తాడేపల్లి రావడం.. జగన్ ఆయనకు సుస్వాగతం పలకడం తెలిసిందే.. అంతేకాకుండా అంబానీ వియ్యంకుడు పరిమళ్ నత్వానీకి వైసీపీ తరఫున జగన్ రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. ఆతరువాత మళ్ళీ ఇప్పుడు అంబానీతో జగన్ బహిరంగ భేటీ జరిగింది. ఈ సదస్సులో అంబానీతో జగన్ సమావేశం కావడం ఆయనను ఆలింగనం చేసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ముకేష్ అంబానీ.. జగన్ పనితీరును మెచ్చుకున్నారు. దేశంలోనే రెండో సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీకి ఉందన్నారు. జగన్ నాయకత్వంలో ఏపీ ప్రజలకు సమర్థ పాలన అందుతుందన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పది గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంటును ఏర్పాటు చేస్తానని తెలిపారు.