Jangaon | పక్కపక్కనే కూర్చున్న రాజయ్య, శ్రీహరి.. ఎదురుపడినా మాటల్లేవ్

Jangaon | వల్మిడిలో జరిగిన కార్యక్రమానికి హాజరు వరంగల్ ప్రజాప్రతినిధులంతా అక్కడికే.. విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వారిద్దరూ ఒకే పార్టీ.రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రజాప్రతినిధులు.ఒకరు సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య, మరొకరు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఇద్దరూ ఒకే నియోజకవర్గం స్టేషన్గన్పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా వారు ఎదురుపడితే ఒకరికొకరు మందలించుకోకుండా మాట్లాడుకోకుండా, మౌనమే తాండవించింది. జనగామ జిల్లా వల్మిడిలో జరిగిన సీతారామచంద్ర స్వామి విగ్రహ పున: […]

  • Publish Date - September 4, 2023 / 01:52 PM IST

Jangaon |

  • వల్మిడిలో జరిగిన కార్యక్రమానికి హాజరు
  • వరంగల్ ప్రజాప్రతినిధులంతా అక్కడికే..

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వారిద్దరూ ఒకే పార్టీ.రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రజాప్రతినిధులు.ఒకరు సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య, మరొకరు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఇద్దరూ ఒకే నియోజకవర్గం స్టేషన్గన్పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా వారు ఎదురుపడితే ఒకరికొకరు మందలించుకోకుండా మాట్లాడుకోకుండా, మౌనమే తాండవించింది.

జనగామ జిల్లా వల్మిడిలో జరిగిన సీతారామచంద్ర స్వామి విగ్రహ పున: ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చున్నప్పటికీ, పరస్పరం మాట్లాడుకోలేదు. మాట్లాడుకోకపోవడం ఆశ్చర్యం కానప్పటికీ, అక్కడ ఆసక్తికరమైన చర్చ జరిగింది. వారిద్దరూ మాట్లాడుకుంటారా? లేదా అని సొంత పార్టీ నాయకులు, మీడియా వారి మీదనే దృష్టి కేంద్రీకరించినప్పటికీ, వారు మౌనాన్ని ఆశ్రయించారు.

రాజుకున్న టికెట్ల చిచ్చు

రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ఇటీవల ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ లిస్టులో స్టేషన్ ఘన్ పూర్ సిటింగ్ ఎమ్మెల్యే గా ఉన్న డాక్టర్ రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు.

సాధారణంగా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య ఉప్పు నిప్పు అన్నట్లుగానే ఉంటుంది. ఒకే పార్టీలో ఉన్నందున అప్పుడప్పుడు అవసరార్థం మాట్లాడుకునేవారు. కానీ, తాజా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన తదుపరి కడియంపై రాజయ్య తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనకు ముందే తనపై కడియం శ్రీహరి కుట్ర చేస్తున్నారంటూ రాజయ్య విమర్శించిన సందర్భాలూ ఉన్నాయి.

ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. టికెట్ రాకుండా కడియం శ్రీహరి ప్రయత్నం చేసి తాను తెచ్చుకున్నారని రాజయ్య తో పాటు ఆయన అనుచరులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇరువురు మధ్య సయోధ్య లేనప్పటికీ, కనీసం మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు.

ఈ స్థితిలో వల్మిడిలో జరిగిన కార్యక్రమానికి ఇద్దరు నాయకులు హాజరుకావడం, పక్కపక్కనే కూర్చున్నప్పటికీ మాట్లాడుకోకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. రానున్న రోజుల్లో వీరిద్దరి మధ్య మాటలు కలుస్తాయా? లేక మౌనమే సమాధానంగా కొనసాగుతాయా? అనేది చర్చ సాగుతోంది.

నేతలంతా అక్కడే

పాలకుర్తి నియోజకవర్గం వల్మిడిలో జరిగిన ఉత్సవానికి రాష్ట్ర మంత్రులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులంతా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ముందుగా ప్రకటించినప్పటికీ ఆయన రాలేకపోయారు. మంత్రి ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఆయన ఆహ్వానంపై మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్ నాయక్, జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

Latest News