Site icon vidhaatha

కవిత రిమాండ్‌, కస్టడిపై తీర్పు 4.30కు వాయిదా


విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రిమాండ్, కస్టడికి ఇవ్వాలన్న ఈడీ అభ్యర్థనపై రౌస్ అవెన్యూ శనివారం సాయంత్రం 4.30గంటలకు తీర్పు ఇవ్వనుంది. కవిత అరెస్టుపైన ఆమె తరపు న్యాయవాదితో పాటు ఈడీ న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును సాయంత్రం 4.30గంటలకు రిజర్వ్ చేశారు.


కవిత రిమాండ్ , కస్టడి అంశంపై కోర్టు ఏం తీర్పు ఇవ్వనుందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అంతకుముందు ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరీ చేసిన నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ దక్కవచ్చని ఆమె తరపు న్యాయవాదులు ఆశిస్తున్నారు.

Exit mobile version