Site icon vidhaatha

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ స్పీడ్‌ పెరిగింది..! ప్రయాణ సమయం తగ్గింది..!

Vande Bharat | కాచిగూడ – యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలు స్పీడ్‌ను స్వల్పంగా పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆయా నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గనున్నది. ఈ నెల 25 నుంచి నిర్ణయం అమలులోకి రానున్నది. ఇకపై రైలు 8.15 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోనున్నది.


ప్రస్తుతం కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ మధ్య వందే భారత్‌ రైలు ప్రయాణానికి 8.30 గంటల సమయం పడుతున్నది. దాదాపు 15 నిమిషాల సమయం ప్రయాణికులకు కలిసిరానున్నది. అయితే, హైదరాబాద్‌, బెంగళూరు ఐటీ నగరాలను కలుపుతూ భారతీయ రైల్వేశాఖ వందే భారత్‌ రైలును ప్రకటించింది. వాణిజ్యపరంగా కీలకమైన రూట్‌ కావడంతో సమయ పాలనకు ప్రాధాన్యం పరిగింది.


ప్రస్తుతం వందే భారత్‌ రైలు వేగం స్వల్పంగా పెంచడంతో 15 నిమిషాలు ప్రయాణం సమయం తగ్గనున్నది. సెమీ హైస్పీడ్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ నుంచి ఆక్యుపెన్సీ రేటు అంచనాలకు తగ్గట్లుగానే ఉందని అధికారులు పేర్కొన్నారు. స్పీడ్‌ పెరగడంతో ఇంకా ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Exit mobile version