Kancharla | ఎమ్మెల్యే కంచర్లకు మరోసారి చేదు అనుభవం..! అడ్డుకున్న అంధ విద్యార్థులు

Kancharla విధాత: సొంత పార్టీలో ప్రత్యర్ధులతో సతమతమవుతున్న నల్గొండ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ఇటీవల వరస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఇండ్లూర్ గ్రామస్తుల నుండి ఎదురైన నిలదీత మరువకముందే తాజాగా నల్గొండ అంధుల పాఠశాల విద్యార్థుల నుండి నిరసన ఎదురైంది. జిల్లా కేంద్రం నల్లగొండలో అంధుల పాఠశాలలను నిర్వహిస్తున్న సంస్థ ఇప్పటికే అంధుల పాఠశాల మూసివేతకు నిర్ణయం తీసుకొని పాఠశాల భవనాన్ని అరోరా ప్రవేట్ పాఠశాల నిర్వాహకులకు కేటాయించింది. […]

  • Publish Date - June 12, 2023 / 04:57 PM IST

Kancharla

విధాత: సొంత పార్టీలో ప్రత్యర్ధులతో సతమతమవుతున్న నల్గొండ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ఇటీవల వరస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఇండ్లూర్ గ్రామస్తుల నుండి ఎదురైన నిలదీత మరువకముందే తాజాగా నల్గొండ అంధుల పాఠశాల విద్యార్థుల నుండి నిరసన ఎదురైంది.

జిల్లా కేంద్రం నల్లగొండలో అంధుల పాఠశాలలను నిర్వహిస్తున్న సంస్థ ఇప్పటికే అంధుల పాఠశాల మూసివేతకు నిర్ణయం తీసుకొని పాఠశాల భవనాన్ని అరోరా ప్రవేట్ పాఠశాల నిర్వాహకులకు కేటాయించింది.

అంధుల పాఠశాల భవనంలో ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే కంచర్లను అంధ విద్యార్థులు మా పాఠశాల భవనంలో ప్రవేట్ పాఠశాల ప్రారంభించవద్దంటూ అడ్డుకున్నారు.

ఖంగుతిన్న ఎమ్మెల్యే కంచర్ల విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో, పాఠశాల నిర్వాహకులతో మాట్లాడారు. అంధ విద్యార్థులు తక్కువగా ఉన్నందున పాఠశాల మూసివేతకు నిర్ణయించారని, ప్రస్తుతం వున్న విద్యార్థులకు తాను అండగా ఉంటానని, అంధ విద్యార్థుల బాగోగులను ఇకనుండి అరోరా ప్రవేట్ పాఠశాల నిర్వాహకులు చూసుకుంటారన్నారు.

త్వరలోనే అంధ విద్యార్థుల భవిష్యత్తు విషయమై కలెక్టర్ తో మాట్లాడి న్యాయం చేస్తానని, మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి ప్రభుత్వ అంధుల పాఠశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. దీంతో వెనక్కి తగ్గిన అంధ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శాంతించి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇచ్చిన హామీలపై హార్షం వ్యక్తం చేశారు.

Latest News